Uday Kiran sister suspects its not suicideఆరేళ్ళ క్రితం యువ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఉదయ్ కిరణ్ మరణం గురించి అనేక పుకార్లు వచ్చాయి కాని ఏదీ నిరూపింపబడలేదు. చాలా రోజులుగా తనను ఇబ్బంది పెడుతున్న డబ్బు సమస్యల కారణంగా అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని చాలా మంది అనుకున్నారు.

దుబాయ్‌లో స్థిరపడిన ఉదయ్ సోదరి తన సోదరుడి మరణంపై సందేహాలు వ్యక్తం చేసింది. ఆమె తన సోదరుడు డబ్బు సమస్యలతో మరణించలేదని, ఎందుకు అనేది తాను తెలుసుకోవాలని అనుకుంటున్నా అని ఆమె చెప్పింది. ఉదయ్ కిరణ్ భార్య విశితా కిరణ్ పై ఆమె అనుమానాలు వ్యక్తం చేసింది

ఉదయ్ మరణం తరువాత, అతని భార్య ఉదయ్ యొక్క డబ్బు మరియు ఆస్తులను విశితా వద్ద ఉన్నాయని, అయితే తాము ఆమెను కాంటాక్ట్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఆమె మాత్రం తమని తప్పించుకుంటుందని ఆమె వెల్లడించింది.

అయితే ఆమె పోలీసులను సంప్రదించి కేసును తిరిగి తెరవమని విజ్ఞప్తి చేస్తుందో లేదో చూడాలి. ఇది ఇలా ఉండగా… చాలా కాలం నుండి ఉదయ్ కిరణ్ జీవితం మీద సినిమా వస్తుందని పుకార్లు ఉన్నాయి. చివరగా… సుందీప్ కిషన్ హీరోగా తేజ ఆ సినిమాను తీస్తాడని వార్తలు వచ్చాయి. అయితే అందులో ఏదీ నిజం కాలేదు.