UAE denies Rs 700 crore  for kerala flooddsవరదల వల్ల సర్వం కోల్పోయిన కేరళకు యూఏఈ ప్రభుత్వం 700కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించినట్లు అయితే దానిని నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యతిరేకించినట్టు జరుగుతున్న వివాదం అందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. యూఏఈ రాయబారి అహ్మద్ అల్ బన్నా మీడియాతో మాట్లాడుతూ అసలు అలాంటి ప్రకటన ఏది ఇప్పటివరకు జరగలేదని చెప్పారు.

అయితే కేరళకు జరిగిన నష్టంపై యూఏఈ జాతీయ విపత్తు కమిటీని ఏర్పాటు చేసిందని, కేరళలో జరిగిన నష్టంపై అంచనా వేసి… తమ స్నేహితులైన కేరళ ప్రజలకు ఆర్థిక సాయాన్ని, మెడిసిన్స్‌ను పంపని ఆ కమిటీ సిఫార్సు చేస్తుందని ఆయన చెప్పారు. కేరళను ఆదుకునేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి కూడా తాము పనిచేస్తున్నామని ఆయన తెలిపారు

అయితే కేరళకు యూఏఈ ప్రభుత్వం 700కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించినట్లు మొదట చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తు కేరళ సీఎం పినరయి విజయన్. దీంతో కేరళకు యూఏఈ ఆర్థిక సాయాన్ని ప్రకటించిందా లేదా అన్న అంశంపై ఇప్పటికే స్పష్టత రాని పరిస్థితి. యూఏఈ తో కేంద్రం తన ప్రకటన వెనక్కు తీసుకునేలా చేసిందా?