u-turn-telugu-trailer-samantha-akkineniసమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన “U టర్న్” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ విడుదలైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి ఆసక్తికరంగా సాగిన ప్రమోషన్ ను ఈ సినిమా ట్రైలర్ తో మరో మెట్టు ఎక్కించారు. దాదాపుగా రెండు నిముషాల పాటు సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్ ను మైంటైన్ చేయడంలో సక్సెస్ అయ్యింది.

ఓ రహదారిలో జరిగిన యాక్సిడెంట్ మిస్టరీని చేధించే కధగా ఈ “U టర్న్” అర్ధమవుతోంది. సమంత కేంద్రంగా నడిచే ఈ కధలో ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్ గా నటించగా, రాహుల్ రవీంద్రన్, భూమికలు ఇతర పాత్రలు పోషించారు. కన్నడ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఒరిజినల్ ‘U టర్న్’ దర్శకుడు పవన్ కుమారే దర్శకత్వం వహించగా, సంగీత దర్శకుడు కూడా కన్నడ మూవీ ఫేం పూర్ణచంద్ర తేజస్వి అందించారు.