KCR Plugs Three Gaps with Cabinet Expansionతెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కాసేపటి క్రితం జరిగింది. గవర్నర్‌గా ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన తమిళిసై సౌందరరాజన్ క్యాబినెట్‌లో చేరనున్న మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉన్న వారిని ఎవరినీ సాగనంపకుండా ఆరుగురు కొత్త వారిని కేసీఆర్ తన టీంలోకి తీసుకున్నారు. మొదటి విస్తరణలో కేటీఆర్, హరీశ్ రావు వంటి వారికి చోటు లభించని నేపథ్యంలో కేసీఆర్ ఆ ఇద్దరినీ తిరిగి తీసుకునిరావడం గమనార్హం.

వీరిద్దరితో పాటు కాంగ్రెస్ పార్టీలో గెలిచి, టీఆర్ఎస్‌లో చేరిన సబితా ఇంద్రారెడ్డికి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్‌లకు అవకాశం కలిపించారు. ఇప్పటిదాకా తెలంగాణకు మహిళా మంత్రులు లేరు. దానితో అనేక విమర్శలు రావడంతో కేసీఆర్ ఒకేసారి ఇద్దరు మహిళలకు అవకాశం కలిపించారు. పువ్వాడ అజయ్ కు అవకాశం కలిపించడంతో ఖమ్మంకు మొట్టమొదటి సారి కేసీఆర్ రెండో విడత ప్రమాణం చేసాకా ప్రాతినిధ్యం కలిపించినట్టు అయ్యింది.

ఇప్పటికి మంత్రివర్గంలో 12 మంది ఉండగా, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురితో కలిపి తెలంగాణలో మంత్రుల సంఖ్య 18కి చేరనుంది. మరోవైపు తెరాసలో ఇటీవలికాలంలో పెరిగిన కొంత అసంతృఫ్తిని తగ్గించే దిశలో కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నట్లుగా ఉంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీ్హరికి ,సీనియర్ నేతలు మదుసూదనాచారికి, నాయిని నరసింహారెడ్డి వంటి వారికి కూడా పదవులు రాబోతున్నాయి. ఇప్పటికే చీప్ విప్,విప్ పదవులను ముఖ్యమంత్రి కెసిఆర్ భర్తీ చేశారు.తాజాగా ఆయన కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా కేటాయించబోతున్నారు. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలను కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించే ఆలోచనలో ఉన్నారట. KCR Cabinet