Liquor in Andhra Pradeshటీవీ9 మాజీ సిఈఓ రవిప్రకాష్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక వెబ్ సైట్ ఒక సంచలనాత్మక కథనం వెలువరించింది. ఏపీలో దశలవారీగా మద్యనిషేధం అంటూ…. ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. మద్యం ధరలు ఎక్కువగా ఉండటం రాత్రి 8 తరువాత మద్యం దొరకకపోవడం దొంగ వ్యాపారానికి దారి తీస్తుంది.

ఆ కథనం ప్రకారం సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకొని చీప్ గా అమ్ముతున్నారట. ఈ భారీ స్కామ్ లో రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రుల హస్తం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మంత్రులు కావడంతో అధికారులు కూడా చూసీ చూడనట్టు వదిలేస్తున్నారట.

అసలు ప్రభుత్వమే మద్యాన్ని రాష్ట్రంలో లేకుండా చేయాలని దశలవారీగా మద్యాన్ని పూర్తిగా రాష్ట్రం నుండి తీసేయాలని చూస్తున్న తరుణంలో రాష్ట్ర మంత్రులే ఇటువంటి వాటికి పాల్పడుతున్నారంటే దారుణం అనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో లిక్కర్ దందా చేస్తున్న ఆ ఇద్దరు మంత్రులు ఎవరో మాత్రం ఆ కథనంలో చెప్పలేదు.

దీనితో వారు ఎవరంటూ విపరీతంగా చర్చ నడుస్తోంది. ప్రతిపక్షాలు ఏకంగా ముఖ్యమంత్రికు తెలియకుండా ఇటువంటి జరగవు అని ఘంటాపథంగా చెబుతున్నాయి. వారిని ఇప్పటికైనా నిలువరించకపోతే ప్రభుత్వానికి అపఖ్యాతి తప్పదు. మరి సీఎం జగన్ ఏం చేస్తారో చూడాలి.