here-why-bharat-ane-nenu-runtime-is-not-an-issueతొలినాళ్ళల్లో నటించిన సినిమాలను మినహాయిస్తే… మహేష్ బాబు కెరీర్ లో ఇప్పటివరకు కమర్షియల్ బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన చిత్రాలు “ఒక్కడు, పోకిరి, శ్రీమంతుడు.” ఈ మూడు చిత్రలలోకల్లా కాస్త బెటర్ టాక్ ను సంపాదించుకున్న సినిమా ‘శ్రీమంతుడు.’ సాధారణంగా మహేష్ బాబు సినిమాలు డివైడ్ టాక్ తో ఆరంభం అవుతుంటాయి. టాలీవుడ్ లో ఆల్ టైం క్లాసిక్ గా మిగిలిన ‘అతడు’ కూడా ఇలానే మొదలైంది.

అయితే ప్రిన్స్ తాజా చిత్రం “భరత్ అనే నేను” అందుకు విరుద్ధంగా మొదలు కావడం విశేషం. యుఎస్ లో ప్రీమియర్ షో పడిన సమయం నుండి ఇప్పటివరకు అత్యధిక శాతం మంది ‘భరత్ అనే నేను’ పక్కా బ్లాక్ బస్టర్ అంటూ హామీ ఇస్తున్నారు. రొటీన్ మహేష్ బాబు సినిమాల టాక్ తో సంబంధం లేకుండా ‘భరత్ అనే నేను’ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే ఉర్రూతలూగిపోతున్నారు.