Hero Uday Kiran held for misbehaviourఈ నెల 23వ తేదీన ‘ఓవర్ ది మూన్’ పబ్ కి వచ్చిన ‘ఫ్రెండ్స్ బుక్’ సినిమా హీరో ఉదయ్ ను బౌన్సర్లు లోపలికి అనుమతించకపోవడంతో ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేసి సిబ్బందిపై దాడికి దిగిన సీసీ టీవీ ఫుటేజ్ ను విడుదల చేసి పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.

అయితే అసలు ఆ రోజు తాను హైదరాబాద్ లో లేనని, ముంబైలో సినిమా షూటింగ్ కు వెళ్ళానని, పలు మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఉదయ్ చెప్పిన సంగతి తెలిసిందే. కానీ పోలీసుల వాదన మరోలా ఉండడంతో విచారణ నిమిత్తం రెండు రోజుల పాటు ఉదయ్ ను తమ కస్టడీకి అప్పగించాలని నాంపల్లి పోలీసులు కోర్టును కోరారు. దీనిపై కోర్టు ఈ రోజు నిర్ణయం తీసుకోనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తానూ కేసీఆర్, జగన్ ల కోసమే బ్రతుకుతానని, ఈ కేసుల నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చిస్తానని చెప్పడంతో సినీ వర్గాలకు చెందినదే కాక, ఈ కేసుకు రాజకీయ రంగు కూడా అంటుకున్నట్లయ్యింది. దీంతో ఉదయ్ పై కోర్టు ఇచ్చే తీర్పు ఇటు రాజకీయంగానూ ప్రాధాన్యతను సంతరించుకుంది.