balika vadhu Pratyusha-Banerjee-suicide‘చిన్నారి పెళ్లికూతురు’గా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను సుపరిచితం అయిన ప్రత్యూష బెనర్జీ మరణం మిస్టరీలో తాజాగా మ‌రో విష‌యం వెలుగులోకి వచ్చింది. గత అయిదు నెలల్లో ప్రత్యూష బ్యాంక్ ఖాతా నుండి దాదాపుగా 24 లక్షల రూపాయలు విత్ డ్రా అయిన‌ట్లు పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. 2015 నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వ‌ర‌కు ఈ డ‌బ్బులు విత్ డ్రా చేసారని గుర్తించారు.

అయితే ఈ డబ్బులు ఎవరు విత్ డ్రా చేశార‌న్న‌ది మాత్రం ఇంకా తెలియ‌లేదు. దీనిపై ప్ర‌త్యూష కుటుంబ సభ్యులు త‌మ‌కేం తెలియ‌ద‌ని సమాధానం ఇవ్వడంతో సహజంగానే అందరి చూపులు ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగే పైనే పడుతున్నాయి. నాలుగైదు నెలల్లో ఇంత మొత్తం రాహుల్ విత్ డ్రా చేసి ఉంటాడా..? అనే కోణంలో పోలీసు వర్గాలు ద‌ర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

ప్రత్యూషకు అసలు ఆర్ధిక బాధలు లేవని స్నేహితులు ఖరాఖండిగా చెప్పడం… మరోవైపు రాహుల్ రాజ్ సింగ్ తండ్రి ప్రత్యూషకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని కొత్త పాయింట్ చెప్పడంతో… ఈ కేసులో ఆర్ధిక లావాదేవీలు కూడా కీలక భూమిక పోషించనున్నాయి. చూడబోతుంటే రాహుల్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.