Twist in Baahubali  2 The Conclusion‘బాహుబలి 2’ తమిళ వర్షన్ కు సంబంధించిన ఓ సన్నివేశం లీకై, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే భాష అర్ధం కాకపోయినా… ఇందులో భావం తెలుసుకున్న ప్రతి తెలుగు ప్రేక్షకుడు అవాక్కవుతున్నారు. ఇప్పటివరకు ‘మహారాజు’గా ప్రమాణ స్వీకారం చేసేది అమరేంద్ర బాహుబలి ప్రభాస్ అని భావించగా, ఈ లీక్ అయిన వీడియోతో అదిరిపోయే ట్విస్ట్ పలకరించినట్లయ్యింది.

మహారాజుగా భల్లాలదేవుడు ప్రమాణ స్వీకారం చేస్తుండగా, సైన్యాధిపతిగా అమరేంద్ర బాహుబలి ఉండడం అనేది ఊహించని ట్విస్ట్. మొదటి పార్ట్ లో రాజమాత శివగామి చెప్పిన ప్రకారం అమరేంద్ర బాహుబలినే రాజు కావాల్సి ఉంటుంది. ‘నా మాటే శాసనం’ అంటూ శివగామి చేసిన వ్యాఖ్యలకు ఎవరూ ఎదురుచెప్పకపోవడం అనేది తెలిసిన విషయమే. అయితే ఇంతలో అసలేమైంది? అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అన్న ప్రశ్న సినీ ప్రేక్షకులను వేధిస్తుండగా, తాజాగా జక్కన్న ఇచ్చిన ఈ ట్విస్ట్ తో మరొక ప్రశ్న వచ్చి చేరినట్లయ్యింది. అయితే మరికొద్ది గంటల్లో దీనికి సమాధానం లభించనున్నప్పటికీ, ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా మారిపోవడంతో… టికెట్ దొరికితే ఓ పెద్ద లాటరీ దొరికినట్లే భావిస్తున్నారు. లీకేజ్ కూడా ఈ విధంగా ‘బాహుబలి 2’కి దోహదం పడడం అసలు ‘ట్విస్ట్.’