TV9 top in TRP Ratings in Telanganaతెలంగాణలో ఎన్నికల వేళ ప్రచారం హోరెత్తుతోంది. కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో ప్రధాన పార్టీలు వారి అభ్యర్థులు ప్రచారంలో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. అదే సమయంలో ప్రచారంలో మీడియా పాత్ర ప్రత్యేకించి టీవీ ఛానెళ్ల పాత్ర మరీ ఎక్కువగా ఉండబోతుంది. ఈ క్రమంలో బార్క్ ఇచ్చిన తాజా రేటింగ్లలో ఏ టీవీ ఛానల్ ఎక్కడ ఉంది అనేది ఆసక్తి కలిగించే అవకాశం. ఎక్కువ వ్యూయర్ షిప్ ఉన్న ఛానల్ ఎక్కువగా ప్రజలను ప్రభావితం చెయ్యగలదు అనేది అక్షరసత్యం.

టీవీ9 ఎప్పటిలానే తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. వేరే ఛానెళ్ల కు అందనంత దూరంలో ఉంది. రెండు మూడు స్థానాలలో ఎన్ టీవీ, టీవీ5 ఉన్నాయి. ఈ ఛానళ్ళు మొన్నటి వరకు తెరాసకు అనుకూలంగా ఉన్నా ఎన్నికల తరుణంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అయినా టీవీ9 కొంత మేర తెరాసకు, టీవీ5 మహాకూటమికి అనుకూలమనే విశ్లేషకులు భావిస్తున్నారు. ఐదవ స్థానంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి ఉంది. అయితే వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఈసారి ఎన్నికలలో పోటీ నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే.

తెలంగాణకు చెందిన వీ6, టీ న్యూస్ ఛానళ్ళు ఆరు ఏడూ స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన తరువాత ఈ ఛానెళ్ళను చూసే వారి సంఖ్యా గణనీయంగా పెరిగింది. ఈ రెండు ఛానళ్ళు తెరాసకు బలమైన మద్దతు ఇస్తున్నాయి. ఏడవ ర్యాంకులో ఏబీఎన్ ఉంది. అయితే ఈ ఛానల్ ముందస్తు ఎన్నికలు వచ్చిన దగ్గరనుండి ఒక నాలుగు రోజులు తెరాసకు ఇంకో నాలుగు రోజులు మహాకూటమికి మద్దతు అన్నట్టు వ్యవహరిస్తోంది. ఈటీవీ ఏపీ, హెచ్ఎం టీవీ, ఏపీ 24X 7 ఏడూ, ఎనిమిది, తొమ్మిది స్థానాలలో ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వార్తల మీదే ఫోకస్ చేస్తున్నాయి.