Forgery Case Registered on TV9 Ravi Prakashటీవీ9 రవిప్రకాష్ గా ఫేమస్ అయిన రవిప్రకాష్ ఇప్పుడు ఆ ఛానల్ నుండి బయటకు నెట్టివేయబడ్డారు. అంతే కాకుండా టీవీ 9 సంస్థలో భాగస్వామిగా ఉన్న అలంద మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో నెలకొన్న వాటాల వివాదంలో రవిప్రకాశ్‌పై సైబరాబాద్‌ పోలీసులు రెండు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణకు హాజరుకావాలంటూ రెండోసారీ నోటీసులిచ్చినా రవిప్రకాశ్‌ హాజరుకాలేదు. దీంతో ఈసారి 41ఏ సీఆర్పీసీ నోటీస్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

ఏదైనా కేసులో వాంగ్మూలం అవసరమైతే పోలీసులు నిందితులనే కాకుండా సాక్ష్యులకూ 160 సీఆర్పీసీ నోటీసులిస్తారు. కానీ నిందితుడిగా పరిగణించదగ్గ ఆధారాలున్నాయని నిర్ధారించుకున్నాకే 41ఏ సీఆర్పీసీ నోటీస్‌ ఇస్తారు. అంటే రవిప్రకాశ్‌ చుట్టూ ఉచ్చు బిగించేందుకు అవసరమైన ఆధారాల్ని పోలీసులు సేకరించి ఉంటారనే చర్చ జరుగుతోంది. ఈ నోటీసులకూ రవిప్రకాశ్‌ స్పందించకపోతే అరెస్ట్‌చేసే అవకాశముంటుంది. మరోవైపు రవిప్రకాష్ ఈ కేసు నుండి తొందరగా బయట పడాలని చాలా టీవీ ఛానెళ్ల యాజమాన్యాలు కోరుకుంటున్నట్టు సమాచారం.

తెలుగులో దాదాపుగా రెండు డజన్ల టీవీ ఛానళ్ళు ఉన్నాయి. నాలుగైదు మినహా అన్నీ నష్టాలలోనే నడుస్తున్నాయి. ఎన్నికలు పూర్తి కావడంతో కనీసం మూడు నాలుగేళ్ళ వరకూ వాటికి ఫండింగ్ మరింత కష్టం కాబోతుంది. మరోవైపు రవిప్రకాష్ ఏదైనా టీవీ ఛానల్ ను టేక్ ఓవర్ చేస్తారనే వార్తలు రావడంతో వారంతా తమకు అవకాశం వస్తుందని అంటే తమకు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇవన్నీ జరగాలంటే ముందు రవిప్రకాష్ అజ్ఞాతం నుండి బయటకు రావాలి.