jaffar-babuఆదివారం నాడు ప్రసారమయ్యే ‘ముఖాముఖి’ కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన జాఫర్ ఇంటర్వ్యూలంటే సంచలనాత్మకమైన ప్రశ్నలతో కూడుకుని ఉంటాయి. దీనిని ఆసారగా చేసుకుని, సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్ లో జాఫర్ పేరుతో ఒక ఫేక్ అకౌంట్ సృష్టించి, జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఒక వర్గానికి అనుకూలంగా ట్వీట్లు చేయడం సంచలనమైంది. ఇది కాస్త ఫేస్ బుక్ లో ఉన్న జాఫర్ దృష్టికి వెళ్ళడంతో, తొలుత ట్విట్టర్ కు ఫిర్యాదు చేయగా, తాజాగా వైజాగ్ త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

సదరు ఫిర్యాదుకు సంబంధించిన పత్రాలను మరియు ఇలా ఫేక్ అకౌంట్ లు సృష్టించడం పట్ల, తన ఆవేదనను ఫేస్ బుక్ వేదికగా పంచుకున్నారు జాఫర్. “నా పేరు మీద నా ఫోటోతో ట్విట్టర్ లో (Jaffar tv9) ఫేక్ ఐ డి క్రియేట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైజాగ్ త్రి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రాధమిక విచారణ తర్వాత కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసారు. నాలుగు రోజుల క్రితం ఇదే విషయాన్నీ ట్విటర్ దృష్టి కి కూడా తీసుకెళ్లడం జరిగిందని” తెలిపారు.

నీచ, నికృష్ట రాజకీయాలంటే… బహుశా ఇదేనేమో… ట్విట్టర్ లో (Jaffar tv9) నా పేరు మీద నా ఫోటోతో ఎవరో నీచులు ఫేక్ ఐడి క్రీయేట్ చేసి నానా రభస సృష్టిస్తున్నారు. వాళ్లకు పడని ప్రముఖులను టార్గెట్ చేసారు. ఈ విషయాన్నీ ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరో వైపు వీళ్ళు రెచ్చిపోతూనే వున్నారు. ఇది ఎవరు చేసారు??? ఎందుకు చేశారన్నది పెద్ద పజిల్. కుట్ర దారులు నన్ను టార్గెట్ చేసారా లేకా పోస్టులతో దాడికి గురి అవుతున్న ఆ ప్రముఖుణ్ణి టార్గెట్ చేసారా అన్నది పోలీసుల ముందున్న ప్రశ్న. ఈ మిస్టరీ నీ పోలీసులు త్వరగా ఛేదించాలని ఆశిద్దాం” అంటూ తన ఆవేదనను, అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అయితే ట్విట్టర్ ఇప్పటికే సదరు ట్విట్టర్ ఫేక్ అకౌంట్ ని తొలగించడం జరిగింది.