TV Actress Pooja Jadhav arrested for threatening to file fake rapeముంబైకి చెందిన ఒక సంస్థ నిర్మించిన షార్ట్ ఫిల్మ్ లో నటించిన పూజా జాదవ్ అనే నటిని పూణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక యువకుడి నుంచి కొంత డబ్బు తీసుకుని, అతనితో శారీరక సంబంధం పెట్టుకున్న పూజా, అనంతరం 5 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. దానికి అతను నిరాకరించడంతో అత్యాచారం చేశావని కేసు పెడతానని బెదిరింపులకు దిగింది. దానికి కూడా అతను తలొగ్గకపోవడంతో పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసింది.

దీంతో చేసేది లేక అతను వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం అతనిపై దాడి చేయడమే కాకుండా అతని వద్దనున్న 6000 రూపాయలు తీసుకుని వెళ్లిపోయింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేసి రెండేళ్ల క్రితం ఇదే విధంగా ఒకరిని ఆమె వేధించిందని గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. విచారణ కోసం ఒకరోజు కస్టడీకి పోలీసులు కోరడంతో అందుకు న్యాయస్థానం అంగీకరించింది.