Bharani Shankar, Bharani Shankar Drunk Drive, Bharani Shankar TV Actor, Bharani Shankar Drunk Drive Case, Bharani Shankar Case, Bharani Shankar Caughtహైదరాబాద్ లో పోలీసుల తనిఖీలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వీకెండ్ మూడు రోజుల్లో తప్పనిసరిగా పోలీసుల తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా నిర్వహించిన ‘డ్రంక్ అండ్ డ్రైవ్’లో జూబ్లీ హిల్స్ ప్రాంతంలో తెలుగు నటుడు భరణిశంకర్ దొరికిపోయారు. భరణిశంకర్ నడుపుతున్న కారును ఆపి, బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షలు నిర్వహించిన తర్వాత 41 శాతానికి పైగా రావడంతో పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసారు.

సోమవారం నాడు భరణిశంకర్ ను కోర్టులో హాజరు పరచనున్నామని పోలీసులు తెలిపారు. 30 శాతంపైగా నమోదైతే పోలీసులు వాహనాన్ని అదుపులోకి తీసుకుంటారన్న విషయం బహిరంగమే. సీరియల్స్ ఆర్టిస్టుగా భరణిశంకర్ వీక్షకులకు సుపరిచితమే. అలాగే పలు సినిమాలలో కూడా నటించిన భరణి, ‘బాహుబలి’లో కూడా భాగస్వామి అయిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో సెలబ్రేటీలు పట్టుబడుతున్న వైనం వారి వ్యవహార తీరును బయటపెడుతోంది.

సెలబ్రిటీలు ఎక్కువగా తిరిగే జూబ్లీహిల్స్ ప్రాంతంలో పోలీసుకు తనిఖీలు నిర్వహిస్తుండగా, వరుసపెట్టి ఎవరో ఒకరు పట్టుబడుతూ ఉండడం విశేషం. అంటే ఫైన్లు కట్టడానికైనా సిద్ధం కానీ, నిబంధనలను మాత్రం పాటించమని పరోక్షంగా సినీ సెలబ్రిటీలు చెప్తున్నారా? అన్న ప్రశ్నలను లేవనేత్తుతోంది.