Tummala Nageswara Rao To contest for Lok Sabha
తెలుగుదేశం నుండి తెరాసలోకి వచ్చి ఇప్పుడు కేసీఆర్ కు అంతరంగికుడిగా మారిన తుమ్మల నాగేశ్వరరావు వచ్చే ఎన్నికలలో ఖమ్మం పార్లమెంట్ కు పోటీ చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న పొంగులేని శ్రీనివాసరెడ్డి ఈ సారి ఎమ్మెల్యేగా బరిలో నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు.

గత కొంత కాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి కేటీఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆయన కేబినెట్ లోకి వచ్చేలా ఈ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో తుమ్మల తెలుగు దేశం తరపున పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకటరెడ్డి మరణంతో జరిగిన పాలేరు ఉప ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు గెలుపొందారు. ఇకపోతే పొంగులేటి గత ఎన్నికలలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ తరపున గెలిచి ఆ తరువాతి కాలంలో తెరాసలో చేరారు. వచ్చే ఎన్నికలలో సీనియర్లను పార్లమెంట్ కు పంపాలని కేసీఆర్ వ్యూహంగా ఉంది.