Tuck Jagadish Movie Teaserనేచురల్ స్టార్ నాని తాజా చిత్రం టక్ జగదీష్ టీజర్ కాసేపటి క్రితం విడుదల అయ్యింది. టీజర్ ని బట్టి చూస్తే నాని ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు ఈ వేసవిలో వస్తున్నట్టుగా ఉంది. అదే సమయంలో దర్శకుడు శివ నిర్వాణ స్టైల్ లో ఎమోషన్లు కూడా దండిగానే ఉన్నాయననిపిస్తుంది.

నాని ఫ్యామిలీలో చాలా మంది యాక్టర్లు ఉండటమే ఇందుకు నిదర్శనం. సీనియర్ నటుడు జగపతి బాబు నాని అన్న పాత్రలో కనిపిస్తున్నాడు. అలాగే నాని ట్రేడ్ మార్క్ మేనరిజమ్స్ కూడా టీజర్ లో కనిపించాయి. స్టైలిష్ విజువల్స్ తో పాటు థమన్ జగదీష్ ఫ్యామిలీ గురించిన ఫోక్ సాంగ్ కూడా అదిరిపోయింది.

రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ లో సాగే ఈ సినిమాలో నాని యాక్షన్ సెక్యూన్సస్ లో కూడా ఇరగదీసినట్టుగా ఉన్నాడు. టీజర్ లాగే చిత్రంలో కూడా అన్నీ సమపాళ్లలో కుదిరితే నాని కి ఇంకో హిట్ ఖాయమే. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 23న వేసవి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

చాలా కాలంగా నానికి సరైన హిట్ అనేది లేదు. అతని చివరి చిత్రం… వీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలై నిరాశపరచింది. టక్ జగదీష్ తరువాత నాని నుండి ఇంకో రెండు సినిమాలు – శ్యామ్ సింఘా రాయ్, అంటే సుందరానికి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.