Pydikondala Manikyala Rao-బీజేపీకి చెందిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు ఆలోచనతో ముందుకు వస్తున్నట్లుగా కనిపిస్తుంది. ప్రసిద్ధ తిరుమల దైవ దర్శనానికి కోటా పెట్టాలని ఆయన ఆలోచన చేస్తున్నారంట. ఈ విధానం అమలులోకి వస్తే ఏడాదికి రెండుసార్లే ఎవరైనా సందర్శించుకునే అవకాశం ఇస్తారట.

దానికి ఆదార్ కార్డు కూడా అనుసందానం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే తిరుమలలో దేవ దర్శనానికి ఆధార్ తప్పనిసరి చేసారు. ప్రతి ఒక్కరికి దైవ దర్శనం కలిగేలా చేయడానికి ఈ ఆలోచన చేస్తున్నామని ఆయన చెబుతున్నారని సమాచారం. ఏడాదికి రెండు సార్లు కంటే ఎక్కువ సార్లు దర్శనం చేసుకునే వాళ్ళు తక్కువే ఉంటారు.

భక్తి తో ఎక్కువ సార్లు వెళ్లే వాళ్లని నియంత్రించడం ఎంతవరకు కరెక్టో? దీనిని భక్తులు ఆహ్వానిస్తారా? లేదా వివాదాస్పదం అవుతుందా? నిత్యం లక్షలాది మంది దర్శించుకునే తిరుమల శ్రీవారి దేవాలయంలో రద్దీని నియంత్రించడం అనేది నిరంతర సమస్యగా పరిణమిస్తుంది. దానికోసం టీటీడీ రకరకాల విధానాలు నిత్యం ముందుకు తెస్తూ ఉంటుంది.