TTD new board membersటీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఏపీ నుంచి ఎనిమిది మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి, తమిళనాడు నుంచి నలుగురికి, కర్ణాటక నుంచి ముగ్గురికి, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి టీటీడీలో చోటు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ నుండి ఇటీవలే కాలంలో ఒక్కో మీడియా హౌస్ ను హస్తగతం చేసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆప్తమిత్రుడు మై హోమ్ రామేశ్వరరావుకు చోటు దక్కింది.

అలాగే మరో వివాదాస్పద పేరు… తెలంగాణకు చెందిన హెటిరో డ్రగ్స్ ఎండీ బి.పార్థసారథిరెడ్డి. గతంలో భారీగా టాక్స్ ఎగవేసి విదేశాలలో అక్రమ పెట్టుబడులు పెట్టిననట్టుగా పారడైస్ పేపర్స్ లో ఆయన పేరు వచ్చింది. తమిళనాడు కోటా నుండి ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ ను నామినేట్ చేసింది ప్రభుత్వం. ఈయన జగన్ కేసులలో ఒక నిందితుడైన విషయం తెలిసిందే. ఆ తరువాత ఐపీఎల్ బెట్టింగ్ కేసులో కూడా ఆరోపణలు ఎదురుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ మూడు పేర్ల మీద వివాదం చెలరేగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి బోర్డులో ఉన్న ఇన్ఫోసిస్ సుధా నారాయణమూర్తికి మరో సారి అవకాశం కలిపించారు. ఏపీలో ప్రకటించిన పేర్లను చూస్తే.. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కొందరికి టీటీడీ సభ్యులుగా అవకాశం కల్పించినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే జగన్ బాబాయ్, వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆశావహులు ఎక్కువ ఉండటంతో బోర్డు సభ్యుల సంఖ్య 19 నుండి 29కి పెంచింది.