TTD Jewellery missing తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా తిరుమల ఏదో జరిగిపోతుందని అప్పటి ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ హడావిడి చేసేది. స్వరూపానంద స్వామి, రమణదీక్షితులు వంటి వారితో ప్రభుత్వ వ్యతిరేకత వచ్చేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు అటువంటి ఘటన ఇంకొకటి జరిగి జగన్ ప్రభుత్వానికి అప్రదిష్ట పాలు చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే…. ఆలయ ట్రెజరీలోని 5 కిలోల వెండి కిరీటం మాయమైంది. దీంతో పాటు మరో రెండు బంగారు ఉంగరాలు కూడా మాయమైనట్లు సమాచారం.

ఈ ఘటనను వెలుగులోకి రాకుండా అధికారులు మేనేజ్ చెయ్యడానికి ప్రయత్నాలు చెయ్యడం గమనార్హం. గుట్టుచప్పుడు కాకుండా టీటీడీ ఏఈవో శ్రీనివాసులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆభరణాల విలువను అతడి జీతం నుంచి రికవరీ చేసుకున్నారు. అసలు ఈ ఘటనకు కారకులెవరన్న విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి సారించకుండా.. కేవలం ఏఈవో శ్రీనివాసుల జీతం నుంచి రికవరీ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అంతేకాకుండా ఆయనొక్కరినే ఎందుకు బాధ్యుల్ని చేశారన్న దానిపై కూడా సమాధానం లేదు. రాష్ట్రప్రభుత్వం నేరగాళ్ళను రక్షిస్తుందా అని కొందరూ, ఈ విషయాన్నీ ఎందుకు దాచిపెట్టాలని చూశారు అని మరి కొందరు జగన్ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార మీడియా సాక్షి ఈ వార్తని పూర్తిగా బ్లాక్ అవుట్ చెయ్యడం గమనార్హం.