కొత్తగా ట్రై చేయొచ్చు కదా సూపర్ స్టార్!‘ఆర్ఆర్ఆర్’ ధియేటిరికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి వచ్చిన అపూర్వ స్పందన గురించి ప్రత్యేకంగా వర్ణించాల్సిన అవసరం లేదు. మొదటి 24 గంటలలో అన్ని భాషలలో కలిపి 50 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుని, ఇప్పటికీ యూట్యూబ్ ట్రేండింగ్ అవుతోన్న ఈ ట్రైలర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ వేశారు.

ఈ ట్రైలర్ లోని ప్రతి సన్నివేశం స్టన్నింగ్ గా ఉందని, మైండ్ బ్లోయింగ్ ట్రైలర్ గా పేర్కొన్న మహేష్, స్టోరీ టెల్లర్ మాస్టర్ ఈజ్ బ్యాక్… గుజ్ బంప్స్… అంటూ తన అనుభూతులను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు సూపర్ స్టార్.

ఎలాంటి ఈగోలకు తావు లేకుండా సహచర హీరోల, దర్శకుల సినిమాలను గానీ, ట్రైలర్స్ గానీ ప్రశంసించడంలో ఈ తరం కథానాయకులలో మహేష్ బాబు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఇటీవల ‘అఖండ’ రిలీజ్ రోజు కూడా ట్వీట్ వేసిన సంగతి సుపరిచితమే.

అందులోనూ రాజమౌళితో చేస్తోన్న తదుపరి హీరో మహేష్ బాబే కావడంతో, సూపర్ స్టార్ నుండి ఈ ట్వీట్ ఊహించిందే. ఆ మాటకొస్తే ఒక్క మహేష్ బాబే కాదు, ట్రైలర్ ను వీక్షించిన తర్వాత ఎవరైనా ఫిదా కావాల్సిందే అన్నట్లుగా ఉంది. అందుకే ఒక్క తెలుగులోనే 20 మిలియన్ క్లిక్స్ ను సొంతం చేసుకుంది.

“ఆర్ఆర్ఆర్” సినిమా రిలీజ్ డేట్ ప్రకటించగానే తన “సర్కార్ వారి పాట” సినిమాను వాయిదా వేసిన మహేష్ నిర్ణయం సముచితమైనదేనని ట్రైలర్ రిలీజ్ తర్వాత స్పష్టమైంది. “ఆర్ఆర్ఆర్”కు ఆ మాత్రం గౌరవం ఇవ్వాలనేది నెటిజన్ల వ్యాఖ్య.

మహేష్ నుండి ఇలాంటి రొటీన్ ట్వీట్స్ ఇటీవల కాలంలో చాలా కామన్ అయిపోవడంతో, బోర్ ఫీల్ అవుతోన్న నెటిజన్లు ఏదైనా కొత్తగా ట్రై చేయమంటున్నారు. సూపర్ స్టార్ వింటున్నారా… ఇంటర్నెట్ ప్రియుల మాటలు… మీకు అర్ధమవుతోందా..!