TRS leader K Keshava Rao comments on ys jagan three capitalsతెరాస ఎంపీ, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కె.కేశవరావు ఆంధ్రప్రదేశ్ లో మండలి రద్దుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను పెద్దల సభ ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆనాడు మండలిని ఎన్టీఆర్‌ రద్దు చేస్తే పోరాటం చేశానన్నారు. మండలి వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టమనడం నాన్సెన్స్‌ అని అన్నారు.

ప్రభుత్వాన్నే నడిపేటప్పుడు అది పెద్ద ఖర్చు కాదని కేకే అభిప్రాయం వ్యక్తం చేశారు. మండలిని రద్దు చెయ్యాలని శాసనసభ తీర్మానం చేసిన నేపథ్యంలో ఏం జరగబోతుందని కేకేను పాత్రికేయులు అడుగగా… సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తీర్మానాలను కేంద్రం అమలు చేస్తుందని చెప్పారు.

అవసరమైతే అమలుకు ఎక్కువ సమయం తీసుకోవచ్చని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి… వైఎస్సార్ కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్నేహసంబంధాలు నెరుపుతున్నారు. తరచు కూర్చుని మాట్లాడుకుంటున్నారు కూడా.

ఈ క్రమంలో ఒక తెరాస ఎంపీ అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చెయ్యడం విశేషం అనే చెప్పుకోవాలి. దేశం మొత్తం మీద మండలి ఉన్న అతికొద్ది రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అన్న విషయం తెలిసిందే. అలాగే తెలంగాణ మండలిలో తెరాస సభ్యులే మెజారిటీ