Pity-That-Our-Country-People-to-have-a-Lying-PM---KCRమరో నాలుగు రోజుల్లో తెలంగాణా ఎన్నికలు జరగనున్న వేళ..అధికార పక్షం అయితే టీఆరెస్ పార్టీ ఒత్తిడికి గురవుతుందా? తెరాస ఓటమి భయంతోనే కొన్ని తెలిసీ తెలియని తప్పులు చేస్తుందా? అసలు తెరాసా ఎందుకు భుజాలు తడుముకుంటుంది. తెరాసాకు అండగా నిలిచే టీ-న్యూస్ కు తోడుగా టీవీ-9 సైతం తెరాసకు వంత పాడుతుందా? అసలు ఏం జరుగుతుంది తెలంగాణాలో అన్న విషయంలోకి కాస్త క్లుప్తంగా వెళితే…

తెలంగాణాలో ఎలెక్షన్ సినిమా మొదలయిన తొలి రోజుల్లో తెరాస పార్టీ భారీగానే సీట్లను కొల్లకొట్టబోతుంది అని అందరూ అనుకున్నారు…అయితే కల క్రమేణా వచ్చిన మార్పుల వల్ల ఆ లెక్కల్లో తేడా వచ్చి ఇప్పుడు తెలంగాణాలో నువ్వా నేనా అన్న ఫైట్ నడుస్తూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే ఎనిక్కల విషయంలో తెరాస చాలా ఒత్తిడికి గురి అవుతుంది అని పక్కాగా అర్ధం అయిపోతుంది. అందులో భాగంగానే తాజాగా లగడపాటి ఎన్నికల ఫలితాలు బయటకు పూర్తిగా చెప్పకుండానే తెరాస వెళ్ళి ఎలెక్షన్ కమిషన్ కి ఆయన పై పిర్యాదు చేసి, తమ భుజాలు తామే తడుముకున్నారు. అంటే అక్కడే అర్ధం అయిపోతుంది తెలంగాణాలో తెరాస ఓడిపోబోతుంది అని. ఆ సర్వే మ్యాటర్ బయటకు వచ్చి వారం కూడా గడవనే లేదు…తాజాగా టీవీ9 సర్వే అంటూ కొత్త లెక్కలతో బయటకు వచ్చేసింది.

అయితే ఇప్పటివరకూ వచ్చిన సర్వేల్లో కూటమి పార్టీలకు 60కి పైగా సీట్లు వస్తే టీవీ 9 సర్వేలో మాత్రం విచిత్రంగా తెరాసాకు 49.7% ప్రజల మద్దతు ఉంది అని, ఆ క్రమంలోనే తెరాస పార్టీ 94 నుంచి 104 సీట్లు వరకూ సాధించే అవకాశం ఉంది అని, ఇక కూటమి 25 లోపే సీట్లతో సరిపెట్టుకోవాలి అని ఒక సర్వేను బయటకు తీసింది. ఇదిలా ఉంటే ఈ సర్వే లెక్కలు చూస్తూ ఉంటే, టీవీ9 పై కెసిఆర్ వత్తిడి చాలా ఉంది అని స్పష్టంగా అర్ధం అవుతుంది. పైగా టీవీ9 ఓటర్లను ప్రభావితం చేసే దిశగానే ఈ సర్వే లెక్కలు చెబుతన్నట్లుగా అనిపిస్తుంది. ఇంకా కాస్త పచ్చిగానే మాట్లాడుకుంటే టీవీ9 టీ-న్యూస్ కన్నా అద్వాన్నం అయిపోయింది అని చెప్పవచ్చు. ఎలా చూసుకున్నా అక్కడున్న పరిణామాల దృష్ట్యా చూసుకుంటే మాత్రం కూటమికి 85+ సీట్లు పక్కాగా వస్తాయి అన్నది పొలిటికల్ వర్గాల విశ్లేషనగా చెప్పవచ్చు.

మరి గతంలో కేసీఆర్ టీవీ 9 ఇబ్బందుల్లోకి నెట్టి భయపెట్టిన తీరు…ఇంకా టీవీ 9 ని వదలలేదో…లేక వేరే ఇతరత్రా కారణాల వల్ల టీవీ 9 తెరాసకు మద్దతుగా నిలుస్తుందో తెలీదు కానీ…మొత్తంగా చూసుకుంటే మాత్రం తెరాసాకు అండగా నిలవడంలో టీవీ 9 టీ- న్యూస్ కి ఏమాత్రం తీసిపోదు అని చెప్పక తప్పదు.