TRS KCR - TDP Chandrababu Naiduతెలంగాణా లో టీడీపీ తెరాసా జత కట్టనున్నాయా? అవును అంటున్నాయి కొన్ని వర్గాలు. ఆదివారం తెలంగాణా సీఎం కేసీఆర్ తెలుగు దేశం దివంగత నేత పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల శ్రీరాం పెళ్లి వేడుక కు హాజరయ్యారు. అక్కడ కేసీఆర్ కాసేపు టీడీపీ నేత పయ్యావుల కేశవ తో ఏకాంత చర్చలు జరిపారు.

ఆ చర్చలు తెలంగాణా లో రెండు పార్టీల మధ్య పొత్తు కు బాటలు వేస్తాయని కొందరి ఊహాగానాలు. కేసీఆర్ తో పాటు ఒకప్పటి తెలుగు దేశం నేతలు తుమ్మల నాగేశ్వర రావు మరియు ఎర్రబెల్లి దయాకర రావు కూడా ఉన్నారు. వీరు చంద్రబాబు కేసీఆర్ మధ్య దౌత్యం జరుపుతున్నారా అని కొందరి అనుమానం. ఐతే ఈ విషయని రెండు పార్టీలు కొట్టిపాడేస్తున్నాయి.

పెళ్లి కి హాజరు ఐన కేసీఆర్ ప్రత్యేకించి పరిటాల రవి ఘాట్ కు వెళ్ళి నివాళి అర్పించడం కూడా పలువురిని ఆకర్షించింది. ఐతే రాజకీయ విశ్లేషకులు మాత్రం టీడీపీ తెరాస పొత్తు అంత సులభం కాదని. దాని వల్ల టీడీపీ కి తెలంగాణా లో ప్రయోజనం ఉన్నా దీని వల్ల టీడీపీ ఆంధ్ర రాష్ట్రం లో ఎంతగానో నష్టాపోతుందని అంచనా.

తెలంగాణా ముఖ్యమంత్రి కనుక నల్గొండ లోక్‌సభ కు ఉపఎన్నికకు వెళ్ళాలని అనుకుంటే ఈ వార్త లో ఎంత నిజం ఉందో తొందర్లోనే తెలిసిపోతుంది. ఈ నెల 5న జరగబోయే సింగరేణి ఎన్నికల ఫలితాలు బట్టి కేసీఆర్ ఒక నిర్ణయం తీస్కోనున్నారని విశ్వసనీయ వర్గాల భోగోట్టా.