trs government allegations on Kodandaramమొన్న ఆమధ్య తెలంగాణా జెఏసీ ఛైర్మన్ కోదండరామ్ పై తెలంగాణా సీఎం కెసీఆర్ ఒంటి కాలిమీద లేచారు. అదే బాటలో మిగతా మంత్రులు కూడా ఆయన మీద విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కోదండరామ్ నక్సల్స్ తో కుమ్మక్కయ్యారని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోపించారు.

అంతేకాక కాంగ్రెస్ తో కూడా కోదండరామ్ కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. “జేఏసీ నుంచి అందరూ వెళ్లిపోతున్నారని, అసలు జేఏసీ ఉందా? ఆయన ప్రభుత్వం మీద బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో అరాచక శక్తులకు స్థానం లేదని, అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి,” అని ఆయన అన్నారు.

హోం మంత్రిగా ఉండి కోదండరామ్ నక్సల్స్ తో కుమ్మక్కయ్యారని ఆరోపించడం తీవ్రమైన విషయం. అందుకు ఆధారాలు చూపి చర్యలు తీసుకుంటారా? ఒకప్పుడు కోదండరామ్ ని పొగిడిన వల్లే ఇప్పుడు ఆయనను రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. బహుశా రాజకీయం అంటే ఇంతేనేమో!