KCR_BRS_Party_APమెుదటి భాగంలో చెప్పుకున్నట్టు బిఆర్యస్, వైసిపి పోత్తు వల్ల వైసిపికి లాభం, టిడిపికి నష్టం దాదాపు శూన్యం అనేది విశ్లేషకుల అభిప్రాయం.

మరి రెండొవ అవకాశం బిఆర్యస్, టిడిపితో జట్టు కడితే ఎలా ఉంటుందో చూద్దాం. దీనివల్ల టిడిపికి 2019 ఎన్నికల్లో జరిగిన నష్టాలు అనేకం ఇప్పుడు జరగకపోవచ్చు. ఆర్ధికంగా బలమైన తెలంగాణ నుంచి తెలుగుదేశం నాయకులకు ఎన్నికల్లో అర్థిక పరమైవ అండదండలు పూర్తిగా దొరుకుతాయి. ఆంధ్రలో కేసిఆర్ అభిమానులు, గతంలో కొంత వరకు వైసిపికి దక్కిన ఆ సామాజికవర్గంలో ఓట్లు ఈసారి టిడిపి దక్కించుకోవచ్చు. అలాగే గత ఎన్నికల సమయంలో వైసిపి చేసిన విధంగా ఈసారి టిడిపి తెలంగాణలో ఇక్కడ కొన్ని అరాచకాలపై కేసులు పెట్టి, ప్రభుత్వాన్ని, నాయకులను ఇబ్బంది పెట్టే అవకాశం రావచ్చు. అలాగే తెలంగాణలో కూడా దాదాపు 50 కు పైగా నియెూజకవర్గాలలో గెలపోటములు ప్రభావితం చెయ్యగలిగిన టిడిపి సానుభూతిపరులు బిఆర్యస్ కు మద్దతు ఇవ్వడం వల్ల అక్కడ ఆ పార్టీ కూడా బాగానే లాభపడే అవకాశం ఉంది. మెున్నటి జిహెచ్యంసి ఎన్నినికలలో సెటిలర్ల వార్డులలో ఫలితాలను అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఈ పొత్తు చూపించి ఇక్కడ వైసిపి ఆంధ్ర సెంటిమెంట్ రెచ్చగొట్టే అవకాశం ఉన్నా, అదెంత వరకు ఫలితం ఇవ్వవచ్చు అనేదానిపై అనుమానాలున్నాయి.

2019 సమయంలో టిడిపి బలంగా ఆంధ్ర సెంటిమెంట్‌తో, ఆ ఐదేళ్ళ పాలనలో తెలంగాణ నుంచి రావలసిన ఆస్ధులు, బకాయిలు, ఉమ్మడి రాజధానిలో ఆర్టికల్ 8 గురించిన పోరాటం, కోర్టుల్లో కేసులు వంటివి నిరంతరం చేసినా, కేంద్రం ఆంధ్రకు చేస్తున్న అన్యాయంపై పార్లమెంట్ లో అవిశ్వాసం పెట్టే స్ధాయిలో చేసినా, ఆంధ్రులు ఆ విషయం పట్టించుకోలేదు. ఇప్పుడు అధికార పార్టీ అటువంటి పోరాటం చెయ్యకపోగా, హైదరాబాద్లో వేల కోట్ల అస్థులను ఒక చిన్న సంతకంతో తెలంగాణకు అప్పగించి, తరచు మర్యాదపూర్వకంగా విందులు చేస్తూ ఇప్పుడు సెంటిమెంట్ రగిలించాలని చూస్తే అది బెడిసికొట్టే ప్రమాదం ఉంది. ఇక గతంలో ఒకరినొకరు నిందించుకుని ఇప్పుడు పొత్తు ఎలా పెట్టుకున్నారు అనే వాదానకు కేంద్రం తెలుగు రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయం అనే కామన్ ఎజెండా చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దీనిని బట్టి చూస్తే బిఆర్యస్, తెలుగుదేశంతో జతకడితే దాని వల్ల తెలంగాణలో కేసిఆర్ తిరిగి అధికారం నిలబెట్టుకునే అవకాశం, ఆంధ్రలో ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశానికి పెరిగిన సానుకూలతకు, పోల్ మేనేజ్మెంటుకు కావలసిన అదనపు హంగులు కొన్ని సమకూరి ఏకపక్ష ఫలితాలకు అవకాశం ఉంది.

శ్రీకాంత్.సి