Trivikram Srinivasపవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌ అనే సినిమా తో సినిమాల్లోకి తిరిగి వస్తున్నాడు. ఈ చిత్రం మేలో విడుదల కావాల్సి ఉంది కానీ కరోనావైరస్ వ్యాప్తి కారణంగా దాని విడుదల ఆగిపోయింది. ఎప్పుడు విడుదల అవుతుంది అనేదాని మీద కూడా క్లారిటీ లేదు. ఇప్పటికి ఇంకా 20 రోజుల షూటింగ్ కూడా మిగిలి ఉంది.

ఈ చిత్రం ప్రారంభమైనప్పటి నుండి, ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రిప్ట్ రాస్తారని పుకార్లు వచ్చాయి. ఒక ఇంటర్వ్యూ దర్శకుడు దానిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు. “మొదట్లో, త్రివిక్రమ్ గారితో స్క్రిప్ట్ రాయించాలని మేము అనుకున్నాము, కానీ అది జరగలేదు. ఆ సమయంలో ఆయన అల వైకుంఠపురంలో తో బిజీగా ఉన్నాడు. కాబట్టి, మేము ముందుకు వెళ్లిపోయాం” అని వేణు శ్రీరామ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేతా థామస్, అంజలి, అనన్య (మల్లేశం ఫేమ్) నటిస్తున్నారు. ఇంతకీ ఈ పింక్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, ఓ లాయర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఆ ముగ్గురు అబ్బాయిల్లో ఒకరు ఓ అమ్మాయిపై అత్యాచారం చేయాలని చూస్తాడు.

ఆమె తప్పించుకునే క్రమంలో బీర్ బాటిల్‌తో అతని తల పగలగొడుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ కేసును మొదటి నుంచి డీల్ చేస్తున్న లాయర్ (అమితాబ్ బచ్చన్) ఎలా నెగ్గారు అన్నదే కథ. పవన్ కళ్యాణ్ వయసు, ఇమేజ్ ని బట్టి కథలో మార్పులు చేర్పులు చేశారట.