a...aa musicత్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన “అ…ఆ…” సినిమా సంగీతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. తొలుత ఈ సినిమాకు తమిళ సంగీత సంచలనం ‘కొలవెరి’ పాట సృష్టికర్త అనిరుద్ ను ఎంపిక చేసారు. అయితే చాలా కాలం షూటింగ్ జరుపుకున్న తర్వాత అనిరుద్ ఇచ్చిన పాటలతో సంతృప్తి చెందని త్రివిక్రమ్, ఉన్నట్లుండి అనిరుద్ ను పక్కనపెట్టి ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ చేయగా, చివరగా మిక్కీ జే మేయర్ తెరపైకి వచ్చాడు.

అయితే సమయం తక్కువగా ఉండడంతో మిక్కీ ట్యూన్స్ ఏ మేరకు ఆకట్టుకుంటాయో అన్న సందేహం నెలకొంది. ఇటీవల విడుదలైన పాటలు సాహిత్య ప్రియులను సంతోష పెట్టాయోమో గానీ, మిక్కీ ట్యూన్స్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అయితే యూట్యూబ్ లో మాత్రం మిక్కీ ట్యూన్స్ కు క్లిక్స్ వెల్లువ కొనసాగుతోంది. ‘అ…ఆ…’ విడుదలైన 6 రోజుల్లో 6 లక్షలకు పైగా హిట్స్ తో దూసుకుపోతుండడంతో చిత్ర యూనిట్ సంతోషంలో ఉంది.

సహజంగానే త్రివిక్రమ్ సినిమాలకు ఉండే క్రేజ్ రీత్యా ఈ రేంజ్ లో క్లిక్స్ దక్కాయోమోనని సినీ జనాలు చర్చించుకుంటున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా 1 మిలియన్ హిట్స్ ను దాటడంతో ఇదంతా త్రివిక్రమ్ చలవేనని అంటున్నారు. ఏది ఏమైనా… ‘అ…ఆ…’ సినిమా పట్ల అంచనాలు అయితే ఏర్పడ్డాయి. మే చివరి వారంలో గాని, జూన్ మొదటి వారంలో గాని సినిమాను విడుదల చేసే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.