trisha nayakiనందమూరి హీరోలు ఎన్టీఆర్‌, బాలకృష్ణలు సంక్రాంతికి తమ సినిమాలతో సందడి చేసేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. ఈ ఇద్దరు హీరోలతో పాటు నాగార్జున మరి కొందరు చిన్న హీరోలు సైతం సంక్రాంతికి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సంక్రాంతి బరిలో మరో సినిమా కూడా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్రిష ప్రధాన పాత్రలో నటించిన ‘నాయకి’ అనే చిత్రం సంక్రాంతికి విడుదల చేయాలని ఫిల్మ్‌ మేకర్స్‌ భావిస్తున్నారు. అందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

తెలుగు మరియు తమిళంలో తెరకెక్కిన ‘నాయకి’ చిత్రం ఫస్ట్‌లుక్‌ పెద్ద సంచలనమే సృష్టించింది. దాంతో తెలుగు మరియు తమిళ ప్రేక్షకుల్లో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనే అతృత ఉంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి వచ్చి స్టార్‌ హీరోల పోటీని తట్టుకుని నిలుస్తుందా అనేది చూడాలి. త్రిషకు తెలుగు మరియు తమిళంలో మంచి క్రేజ్‌ ఉన్నందున రెండు చోట్ల కూడా భారీగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరి ఈ తీవ్ర పోటీ మధ్యలో అత్యధిక థియేటర్లలో విడుదల చేయడం సాధ్యమేనా అనేది అనుమానామే.