Trisha Krishnan, trisha Carf Number, pennsylvania, Telugu heroine trisha, Kollywood, trsha Thanked his fanహీరో హీరోయిన్లపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా అభిమానం కురిపిస్తూంటారు. సాధారణంగా బైక్లు, ఆటోలు, కార్లపై స్టిక్కర్లు వేయించడం అనేది ఇండియాలో చూపించే అభిమానం సర్వ సాధారణం. అయితే మరి ఇతర దేశాలలో ఉన్న వారు ఏ విధంగా అభిమానాన్ని చూపించుకోవచ్చు అంటే… యుఎస్ లో అయితే ఓ సౌలభ్యం ఉంది మరి!

తమకు ఇష్టమైన ఒక పేరును కారు పేరుగా గానీ, నెంబర్ గా గానీ పెట్టుకోవచ్చు. అందులో భాగంగా ఓ కారుపై ‘త్రిష’ పేరు కనపడడం విశేషం. యుఎస్ లోని పెన్సిల్వేనియా ఏరియాలో ఉన్న ఈ కారు ఫోటోను షేర్ చేసుకుంటూ హీరోయిన్ త్రిష ఓ ట్వీట్ చేసింది. ఎవరో తెలియదు గానీ చాలా క్యూట్ గా ఉందని.., వారికి థాంక్స్ అంటూ తన అనుభూతులను పంచుకుంది త్రిష.

అయితే ఇంతకీ అది హీరోయిన్ త్రిషపై కురిపించే అభిమానమేనా? లేక ఆ పేరును ఆ కారు ఇంటికి సంబంధించిన వారిదా? అంత క్లారిటీ అయితే త్రిష ఇవ్వలేదు గానీ, గతంలో ‘మహేష్ బాబు’ వంటి పలువురి హీరోల పేర్లతో కార్లు దర్శనం ఇవ్వడంతో, ఆ క్రమంలోనే ఇది కూడా ఉండవచ్చన్న ఫైనల్ నిర్ణయానికి త్రిష వచ్చేసినట్లున్నారు.