trisha-pawan-mahesh‘వ‌ర్షం’ సినిమాలో ప్ర‌భాస్ ప‌క్క‌న అల్ల‌రి అమ్మాయిగా న‌టిస్తూ తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన చెన్నై భామ త్రిష, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా,’ ‘అత‌డు,’ ‘పౌర్ణ‌మి,’ ‘స్టాలిన్,’ ‘ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే,’ ‘కృష్ణ‌,’ ‘న‌మో వేంక‌టేశ’ వంటి చిత్రాల‌తో టాలీవుడ్ లో ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలలో నటిస్తూ కాలం వెలిబుచ్చుతోంది. తాజాగా ట్విట్ట‌ర్ ద్వారా త‌న అభిమానుల‌తో కాసేపు ముచ్చటిస్తూ, ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం అందించింది.

త‌న‌ ఫిట్‌నెస్ ర‌హ‌స్యం నియమబద్ధంగా ఆహారం తీసుకోవడమేన‌ని, త‌నకు ఐస్‌క్రీం అంటే చాలా ఇష్ట‌మ‌ని, ఇటీవల చూసిన చిత్రాలలో “సుల్తాన్” బాగా న‌చ్చింద‌ని త్రిష చెప్పుకొచ్చింది. ‘మిమ్మల్ని ఏ ప్ర‌శ్న అడిగితే ఇష్టం ఉండ‌దు?’ అని త‌న అభిమాని వేసిన ప్ర‌శ్న‌కు త‌న‌ను ఎవ‌ర‌యినా పెళ్లెప్పుడు చేసుకుంటావ్‌? అని అడిగితే ఆ ప్ర‌శ్న ఇష్టం ఉండ‌ద‌ని చమత్కరించింది.

ఇక, టాలీవుడ్ హీరో పవన్‌ కల్యాణ్‌ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే… అన్న ప్రశ్నకు… ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆయన శైలిలో ఆయన జీవిస్తార‌ని పేర్కొంది. స్టార్‌ డమ్‌కు ప‌వ‌న్‌ దూరంగా చాలా సింపుల్‌గా ఉంటారని చెప్పింది. అలాగే ప్రిన్స్ మహేష్ బాబు గురించి చెప్తూ… వృత్తిపై అంకితభావం కలిగిన స్వీట్‌ సూపర్‌ స్టార్ గా త్రిష అభివ‌ర్ణించింది. సినీ పరిశ్రమకు నిజమైన ‘డార్లింగ్‌’ ప్ర‌భాస్ ని పేర్కొంది.

తాను బాధ‌లో ఉన్నప్పుడు అందరికీ దూరంగా వెళ్లిపోతాన‌ని, తాను వివాదాస్ప‌ద అంశాల‌ను చిరునవ్వుతో ఎదుర్కుంటాన‌ని చెప్పింది. త‌న‌కు బీఎండబ్ల్యూ కారంటే ఇష్ట‌మ‌ని పేర్కొంది. త‌న అభిమాన నటి ప్రియాంక చోప్రా అని, నటుడు సల్మాన్‌ఖాన్ అని చెప్పింది.