No Romantic scenes in RRR movie“ఆర్ఆర్ఆర్” సినిమాకు సినీ విశ్లేషకులు అద్భుతమైన రివ్యూలతో బాక్సాఫీస్ కు స్వాగతం పలికిన విషయం తెలిసిందే. రాజమౌళి కెరీర్ లోనే బెస్ట్ మూవీగా కీర్తించబడుతున్న ఈ సినిమాపై ఓ కంప్లైంట్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు కొల్లగొడుతున్నప్పటికీ, గత రికార్డులను తుడిచి పెడుతున్నప్పటికీ, ఓ విషయంలో మాత్రం సినీ ప్రేక్షకులు అసంతృప్తిగా ఉన్నారట. అదేమిటంటే… “ఆర్ఆర్ఆర్” సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు లేవట. నిజమే సోషల్ మీడియాలో వీటిపై మేమ్స్ కూడా ప్రత్యక్షం అయ్యాయి.

సహజంగా రాజమౌళి సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలకు కొదవుండదు. హీరోయిజాన్ని ఎంత పీక్స్ లో చూపిస్తారో, హీరో – హీరోయిన్ల నడుమ రొమాంటిక్ సన్నివేశాలను కూడా అంతే కిక్ ఇచ్చే విధంగా తీర్చిదిద్దుతారు. ‘విక్రమార్కుడు’లో అనుష్క-రవితేజల సీన్స్ గానీ, ‘బాహుబలి’లో అనుష్క-ప్రభాస్-తమన్నాల సీన్స్ గానీ మాస్ కు కిక్ ఇచ్చే విధంగా స్క్రీన్ పై చూపించడంలో జక్కన్న దిట్ట.

కానీ “ఆర్ఆర్ఆర్” కధ అలాంటి మాస్ రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించడానికి ఆస్కారం కల్పించలేదు, దర్శకుడు రాజమౌళి కూడా కధ సైడ్ ట్రాక్ అయ్యే విధంగా అలాంటి సీన్స్ ను తెరకెక్కించలేదు. ఇదే ‘ఆర్ఆర్ఆర్’పై హాస్యాస్పద రీతిలో కంప్లైంట్ గా మారింది. ఫన్నీగా మారిన ఈ అంశంపై నెట్టింట అనేక మేమ్స్ సందడి చేస్తూ నవ్వులు పూయిస్తున్నాయి.

‘కోడిగ్రుడ్డు మీద ఈకలు పీకినట్లు’ కొందరు విశ్లేషకులు నెగటివ్ పాయింట్స్ గా ప్రస్తావించడంతో, నెటిజన్లు ఈ ట్రెండింగ్ ను ప్రారంభించారు. అయితే మరికొందరు దీనినే ప్లస్ పాయింట్స్ గా కీర్తిస్తున్నారు. అనవసరపు రొమాంటిక్ సీన్స్ గానీ, అసందర్భపు కామెడీని గానీ లేకుండా ఫ్రెండ్ షిప్ మీద తీసిన చిత్రంగా కొనియాడుతున్నారు.

https://twitter.com/kiran85938890/status/1507296568915161090