Chandrababu-Naiduమాజీ ఎమ్.పి, టిడిపి నేత రాయపాటి సాంబశివరావు ట్రాన్స్ స్ట్రాయ్ స్కామ్ లో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. దేశంలోనే జరిగిన ఒకానొక అతిపెద్ద స్కామ్లలో ఇది ఒకటని… మీడియాలో వార్తలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని వాటిని దొంగ కంపెనీలకు మళ్లించి బ్యాంకులకు పంగనామాలు పెట్టారు అనేది ఆరోపణ.

అయితే ఈ స్కామ్ ని టీడీపీ మీదకు నెట్టేలా సాక్షి ఈరోజు ఒక కథనాన్ని ప్రచురించింది. స్కామ్ లో టిడిపి అధినేత చంద్రబాబు వాటా ఎంతో అన్నట్టు ఒక వార్త వేసింది. అయితే దీనిపై టీడీపీ గట్టిగా స్పందించడంలో పూర్తిగా విఫలం అయ్యింది. బ్యాంకుల వద్ద నుండి తీసుకుని డిఫాల్ట్ అయ్యారని చెప్పబడుతున్న రుణాలలో 90% 2013లో తీసుకున్నవే.

మిగతా రుణాలలో చివరిగా తీసుకున్న రుణాలు 2014 ఫిబ్రవరిలో తీసుకున్నవే. అంటే అన్నీ చంద్రబాబు అధికారంలోకి రాకముందువే. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకా… రాయపాటి టీడీపీలో ఉన్నా… ఆయన కంపెనీకి పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టు ని పూర్తి చేసే సామర్ధ్యం లేదని.. కాంట్రాక్టర్ ని మార్చాలని పలుమార్లు కేంద్రానికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కోరారు.

అయితే అప్పుడు సదరు మంత్రి ఈ దశలో కాంట్రాక్టర్ ని మారిస్తే లీగల్ గా ఇబ్బంది అవ్వొచ్చని… భారీగా పెనాలిటీ కూడా చెల్లించాల్సి ఉంటాదని చంద్రబాబు కు నచ్చజెప్పిన సంగతి తెలిసిందే. దానితో చేసేది ఏమీ లేక పనులు చెయ్యగల సబ్ కాంట్రాక్టర్లను తెచ్చి పనులు ముందుకు నడిపించారు. ఇవన్నీ చెప్పుకోలేక టీడీపీ ప్రజల ముందు దోషిగా నిలబడే అవకాశం ఉంది. త్వరగా మేలుకోకపోతే భారీ నష్టం తప్పదు.