Trai to examine Reliance Jio offer Till 31st Marchడిసెంబర్ 3 వరకు ఉచిత డేటా, కాల్స్ సేవలను అందిస్తామని ప్రకటించిన రిలయన్స్ జియో, తాజాగా అదే ఫ్రీ ఆఫర్ ను మార్చి 31 వరకూ పొడిగించడంపై టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా టెలికం ఆపరేటర్ల నుంచి వస్తున్న ఒత్తిడితో, అసలు ఇంత ఫ్రీగా డేటాను, కాల్స్ ను ఎలా ఇవ్వగలుగుతారో పరిశీలించాలని ట్రాయ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

1 జీబీ డేటాను ఎయిర్ టెల్ నెల రోజులకు 259 రూపాయలకు విక్రయిస్తున్న సమయంలో ఆరు నెలల పాటు ఉచిత డేటా ఇవ్వడమంటే రిలయన్స్ జియో ఒక్కో కస్టమర్ పై కొన్ని వేల రూపాయలను వెచ్చిస్తున్నట్టే లెక్క. దీంతో ముఖేష్ నోటి వెంట వచ్చిన కొత్త ఆఫర్లను నిశితంగా పరిశీలిస్తున్నామని ట్రాయ్ అధికారి ఒకరు తెలిపారు. ఆఫర్లు నియమ, నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? అన్న విషయాన్ని ట్రాయ్ పరిశీలించనుందని తెలుస్తోంది.

ఒకవేళ నిబంధనలకు విరుద్ధమని తేలితే ముఖేష్ ప్రకటించిన మార్చి 31 వరకు ఫ్రీ ఆఫర్ ఆవిరి అయినట్టేనా? అని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఫ్రీ ఆఫర్ లో కొన్ని మార్పులు వచ్చిన విషయాన్ని కూడా కస్టమర్లు గమనించాల్సి ఉంది. గతంలో రోజుకు ఉచితంగా 4జీబీ డేటాను ఉచితంగా ఇస్తుండగా, తాజాగా ఆఫర్ మాత్రం రోజుకు 1జీబీ డేటాను మాత్రమే ఇస్తోంది.