aditi raoనోయిడా ప్రాంతంలోని సెక్టార్ 18లో కొత్తగా ఏర్పాటు చేసిన మాల్ లో జరుగుతున్న ఓ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు బయలుదేరిన బాలీవుడ్ బ్యూటీ అదితిరావుకు చుక్కెదురైంది. సమయం మించిపోతుండటంతో, తన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కారు ను రాంగ్ రూట్ లో పయనించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ధర్మేంద్ర యాదవ్, కారును అడ్డగించి ముందుకు కదలనివ్వక పోవడంతో అదితి రావు సహాయక సిబ్బంది కాస్త హడావుడి చేసారు.

ఈ సందర్భంగా మాల్ యాజమాన్యం కల్పించుకున్నా ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ధర్మేంద్ర యాదవ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. దీంతో ఇక లాభం లేదనుకున్న అదితి కారు దిగి తన కాళ్ళకు పని చెప్పి, నడుచుకుంటూ మాల్ దగ్గరికి వెళ్లిపోయింది. సాధారణంగా ఇలాంటి ఉదంతాల సందర్భాలలో సెలబ్రిటీలను మినహాయింపు ఇస్తూ ఉంటారు పోలీస్ అధికారులు. కానీ, ఇక్కడి ఉదంతంలో మాత్రం బాలీవుడ్ ముద్దుగుమ్మను నడిరోడ్డుపై నడిపించిన ఘనతను సొంతం చేసుకున్నాడు సదరు ఇన్ స్పెక్టర్.