Touch Chesi Chudu -movie Talk‘రాజా ది గ్రేట్’ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్న మాస్ మాహారాజా రవితేజ నటించిన “టచ్ చేసి చూడు” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇచ్చారు? యుఎస్ ప్రీమియర్స్ నుండి వెలువడిన ‘ఫస్ట్ టాక్’ ఎలా ఉంది? అంటే… చిత్ర యూనిట్ కు పూర్తి నిరాశను కలిగించే విధంగా ఉందని చెప్పొచ్చు.

సినిమా బాగుంటుందని ధియేటర్ కు వెళ్ళిన ప్రేక్షకులను ఎలా అయితే ‘టచ్ చేసి చూడు’ నిరాశపరిచిందో, ఈ సినిమాకు వెలువడిన ‘ఫస్ట్ టాక్’ కూడా అలాగే చిత్ర యూనిట్ కు నిరాశను మిగులుస్తోంది. రొటీన్ మూస కొట్టుడుకు తోడు, ఆకట్టుకోలేని కధ, కధనం తోడు కావడంతో, ఏ మాత్రం కొత్తదనం గానీ, ఎంటర్టైన్మెంట్ గానీ లేని ఈ “టచ్ చేసి చూడు” ఈ ఏడాదిలో టాలీవుడ్ కు ఎదురైన మరో భారీ నిరాశగా నిలుస్తుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.

ఏ విభాగంలోనూ పెద్దగా ఆకట్టుకోలేని “టచ్ చేసి చూడు”ను రవితేజ అభిమానులు సైతం అంగీకరించే పరిస్థితి ఉంటుందో లేదో అన్నది వేచిచూడాలి. ఒక రకంగా చెప్పాలంటే… ఈ సినిమాను ‘టచ్’ చేయాలంటే ప్రేక్షకులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి నెలకొందన్న భీకరమైన ‘ఫస్ట్ టాక్’ బయటకు వచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే… ఈ ఏడాదికి రెండో ‘అజ్ఞాతవాసి’ అవుతుందేమో అన్నంతగా టాక్ వెలువడింది.