గ్లామర్ హీరోయిన్ గానే కాక, మంచి అభినయం ప్రదర్శించే బ్యూటీగా ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకుంది దీపికా పదుకునే. అయితే ఇటీవల దీపికా వేస్తున్న అడుగులు మాత్రం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన “గెహరైయాన్” మూవీ ద్వారా మరోసారి తమ గ్లామర్ రుచిని ప్రేక్షకులకు రుచిచూపించగా, తాజాగా.పాల్గొన్న ఓ ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాను చుట్టేసాయి. పసుపు రంగు బికినీ ధరించి ఉన్న దీపికా పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
రణవీర్ సింగ్ తో వివాహం అయిన తర్వాత గ్లామర్ ను పక్కనపెట్టి, అభినయం ప్రదర్శించే రోల్స్ చేసింది దీపికా. ఈ ఒరవడిని పక్కనపెట్టి, ఇటీవల వరుసగా అందాల ప్రదర్శన చేస్తుండడం విశేషం. అందులోనూ ఈ ఫోటోషూట్ పిక్స్ అయితే మరీ శృతిమించినవిగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బాలీవుడ్ హీరోయిన్లకు తమ బ్యాక్ ప్రదర్శనలు ఎక్కువైపోతున్నాయని, ఇందుకోసం దిశా పటాని, కియారా అద్వానీ, ఈషా గుప్తా తదితరులు పోటీపడి మరీ తమ బ్యాక్ సౌందర్యాన్ని సోషల్ మీడియాకు ఎక్కిస్తున్నారన్న విమర్శలు ఎక్కువవయ్యాయి. గతంలో వీరి పిక్స్ కూడా ఇదే స్థాయిలో సోషల్ మీడియాలో సందడి చేసాయి.
అయితే ఇదే కోవలో టాప్ హీరోయిన్లు సైతం పయనిస్తుండడంతో, బహుశా హీరోయిన్లు కూడా అప్ డేట్ అవుతున్నారేమో అనిపించక మానదు. హాలీవుడ్ బ్యూటీస్ కు ఇలాంటి కాస్ట్యూమ్స్ సర్వసహజం. ఇండియన్ హీరోయిన్లు కూడా ఆ సంస్కృతిని పుణికిపుచ్చుకునే క్రమంలోనే ఈ అందాల ప్రదర్శనాలేమో!?