Top director s in que for Vijay Deverakonda పూరి జగన్నాధ్ స్టైల్ ఆఫ్ డైరెక్షన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక మారుతి తీసే మంచి ఎంటర్‌టేన్‌మెంట్ సీన్స్ అందరికీ మంచి టైమ్ పాస్ ను అందిస్తాయి…అంతేనా ఆ సినిమాను పదే పదే చూసేలా చేస్తాయి. ఇక గోపీచంద్ మలినేని కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. చాలా గ్యాప్ తర్వాత బలుపుతో రవి తేజాకి అప్పట్లో హిట్ ఇచ్చిన దర్శకుడు ఇతడే..అయితే ఈ ముగ్గురు దర్శకులు ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక యువ హీరో కోసం ఎదురు చూస్తున్నారట. అతను ఎవరో కాదు మన విజయ్ దేవరకొండ.

దాదాపుగా టాప్ హీరోలకు ఉన్నంత డిమాండ్ విజయ్ కి ఉంది ఇప్పుడు. అందుకే ఒక సినిమా రిలీజ్ కాకుండానే తన తరువాత సినిమా ట్రేలర్ రిలీజ్ చేసే మారుతి, విజయ్ కోసం వెయిట్ చేస్తున్నాడట. తక్కువ సమయంలో సీనియాలు తీసేసి రిలీజ్ చేసే పూరీ విజయ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడట. ఇక గోపీచంద్ మలినేని విజయ్ చాన్స్ ఇస్తే కధ చెప్పడం కోసం ఎదురు చూస్తున్నాడట. అయితే ఈ కోవలో మారుతి ఇప్పటికే రెండు-మూడు కధలు తయారు చేసి విజయ్ ఏది ఓకే అంటే దానితో ముందుకు వెళ్ళాలి అని చూస్తున్నాడు. ఇక పూరీ ఇప్పటికే ఒక లైన్ విజయ్ కి చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక గోపీచంద్ కూడా విజయ్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ లో ఉన్నాడు.

అయితే మరో పక్క విజయ్ మాత్రం రెండు సినిమాలతో ఫుల్ ప్యాక్ అయ్యి ఉన్నాడు. మరి ఇంత టైట్ లో ఉన్న విజయ్ ఈ దర్శకులకు అవకాశం ఇస్తాడో, లేక వేరే దర్శకులకు ఎవరికైనా కమిట్ అవుతాడో తెలీదు కానీ, మొత్తంగా చూసుకుంటే మాత్రం యువ హీరోలు ఎంతమంది ఉన్నా, దర్శకులు అందరూ విజయ్ డేట్స్ కోసం ఎగబడుతూ ఉండడం చూస్తూ ఉంటేనే చెప్పవచ్చు విజయ్ డిమ్యాండ్ ఏంటో.