BA-Raju-Tollywood-udpatesతెలుగు సినిమా పరిశ్రమలో ఏ హీరో ఏ సినిమా ఎవరితో ఎప్పుడు ఎలా చేస్తున్నారో తెలుసుకోవాలనుందా? అయితే మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ప్రముఖ ‘పిఆర్ఓ’ మరియు ఇండస్ట్రీ హిట్ మ్యాగ్ జైన్ అధినేత బిఎ రాజు గారి ట్విట్టర్ అకౌంట్ ను ఒక్కసారి వీక్షిస్తే సరిపోతుంది. ఎప్పుడూ లేని విధంగా మంగళవారం నాడు రాజు గారు ఇచ్చిన సమాచారం మొత్తం సినీ అభిమానులను ఖుషీ చేసింది. ఏ ఒక్క హీరోను వదలకుండా అందరి హీరోల గురించి అప్ డేట్స్ ఇచ్చారు ‘ఇండస్ట్రీ హిట్’ అధినేత. ఇందులో ఎవరికీ కావాల్సిన వారు తీసేసుకోవచ్చు..!

వివి వినాయక్ – చిరంజీవిల సినిమా జూన్ 20 నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్!
మారుతీ – వెంకటేష్ ల ‘బాబు బంగారం’ సినిమా జూలై 23 విడుదల!
మురుగదాస్ – మహేష్ కాంభినేషన్లో సినిమా జూలై 15 నుండి నిర్విరామంగా షూటింగ్!
త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ – రామ్ చరణ్, త్రివిక్రమ్ – దిల్ రాజుల కాంభినేషన్స్ ప్లానింగ్!
కొరటాల – జూనియర్ ల సినిమాలో ఎన్టీఆర్, సమంతలపై 8 నుండి 12 వరకు పాట చిత్రీకరణ!
‘బాహుబలి 2’ క్లైమాక్స్ కోసం ప్రభాస్ నెల రోజులుగా ఫైట్ రిహార్సల్స్!
సురేందర్ రెడ్డి – రామ్ చరణ్ ల “ధృవ” సినిమా సెప్టెంబర్ 30న విడుదలకు ప్లాన్!
హరీష్ శంకర్ – అల్లు అర్జున్ జోడిలతో సినిమాకు స్టోరీ రెడీ!
శేఖర్ కమ్ముల – వరుణ్ తేజ్ ల సినిమా షూటింగ్ జూలై 18 నుండి ప్రారంభం!
సాయిధరమ్ తేజ్ హీరోగా దిల్ రాజు సమర్పణలో ‘జవాన్’ సినిమా!
‘నేను శైలజ’ ఫేం కిషోర్ – నితిన్ కాంభినేషన్ లో ఒక సినిమా ప్లానింగ్!
నాగచైతన్య నటిస్తున్న ‘సాహాసం శ్వాసగా సాగిపో’ ఆడియో జూన్ 17వ తేదీన!
కొత్త దర్శకుడు చంద్రమోహన్ – శర్వానంద్ లతో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ శంషాబాద్ లో!
సంతోష్ శ్రీనివాస్ – రామ్, రాశిఖన్నాలతో 14రీల్స్ నిర్మిస్తున్న సినిమా శంషాబాద్ లో షూటింగ్!