Tollywood producers meeting Wages of small film workersతెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఏడాదిలో రెండు వంద‌ల‌కు పైగానే చిత్రాలు రిలీజ్‌ల‌వుతుంటాయి. నిజానికి ఇన్ని చిత్రాలు మ‌రే ఇండ‌స్ట్రీలోనూ కావు. కానీ స‌క్సెస్ రేట్ ఎంతో తెలుసా! ఐదు శాతం మాత్ర‌మే. ఇందులో భారీ బడ్జెట్‌, మీడియా బ‌డ్జెట్ చిత్రాల‌న్నీ క‌లిపి 30-40 మించవు. మిగిలిన‌వ‌న్నీ చిన్న సినిమాలే. సినీ కార్మికులు ఎక్కువ చిన్న సినిమాల‌పైనే ఆధార‌ప‌డి బ‌తుకుతుంటారు.

ఇప్పుడు బ‌డా ప్రొడ్యూస‌ర్స్‌మ‌ని చెప్పుకుంటున్న‌వారంద‌రూ చిన్న సినిమాల‌ను నిర్మించి ఎదిగిన వారే. కానీ ఇప్పుడు వారు ఆ విష‌యాన్ని మ‌ర‌చిపోయిన‌ట్లున్నారు. ఎందుకో తెలుసా!..రీసెంట్ టైమ్‌లో నిర్మాత‌లంద‌రూ క‌లిసి సినిమా బ‌డ్జెట్స్ ప‌రిమితులు దాటుతున్నాయి. వాటిని ఎలాగైనా కంట్రోల్ చేయాల‌ని అనుకున్నారు. వెంట‌నే స్ట్ర‌యిక్ అని ప్ర‌క‌టించేశారు. దాదాపు నెల రోజుల పాటు ఈ స్ట్ర‌యిక్ కొన‌సాగింది. సినిమా నిర్మాణానికి హీరోల రెమ్యున‌రేష‌న్ పెరిగిపోవ‌ట‌మే కార‌ణ‌మని నిర్మాత‌లు అన్నారు. సినిమా బ‌త‌కాలంటే పెద్ద హీరోలు వారి రెమ్యున‌రేష‌న్స్ త‌గ్గించుకుంటే బావుంటుంద‌ని అన్నారు. ప‌నిలో ప‌నిగా సినీ కార్మికుల‌కు సంబంధించిన వేత‌నాల విష‌యంలోనూ డిస్క‌ష‌న్ జ‌రిగింది.

ఈ డిస్క‌ష‌న్‌లో చిన్న బ‌డ్జెట్ చిత్రాల‌కు ప‌నిచేసే కార్మికుల‌కు ఓ ప‌ద్ధ‌తిలో రెమ్యున‌రేష‌న్స్‌.. భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు మ‌రో ప‌ద్ధ‌తిలో అంటే కాస్త ఎక్కువ రెమ్యున‌రేష‌న్స్ ఇవ్వాలంటూ కార్మికులు త‌మ వాదన‌ను వినిపించారు. కానీ నిర్మాత‌లు సినీ కార్మికుల‌కు వేత‌నాలు త‌గ్గిస్తామ‌ని, అలాగే అన్ని సినిమాల‌కు ఒకేలాగానే జీత‌భత్యాల‌ను చెల్లిస్తామ‌ని తెలిపారు. త‌ర్వాత మాట్లాడుదాం షూటింగ్స్ మొద‌లు పెడ‌దామ‌ని నిర్మాత‌లు చెప్ప‌టంతో.. కొన్ని రోజుల క్రితం సినీ కార్మికుల‌తో జీత భత్యాల‌కు సంబంధించిన‌ జ‌రిగిన ఈ చ‌ర్చ‌లు తాత్కాలికంగా ముగిశాయి. సినిమా షూటింగ్స్ ప‌ట్టాలెక్కాయి. అయితే ఇప్ప‌టికీ ఈ విష‌యం తెగ‌లేదు. దీంతో ఈ నెల 17 నుంచి సినీ కార్మికులు మ‌రోసారి స‌మ్మె సైర‌న్ మోగించాల‌ని అనుకుంటున్నట్లు టాక్‌.

ఈ ప‌రిణామం చోటు చేసుకోవ‌టానికి గ‌ల కార‌ణాన్ని ప‌రిశ్ర‌మ‌లో ఓ వ‌ర్గం ఎలా చెబుతుందంటే.. సినీ నిర్మాణ వ్య‌యాన్ని కంట్రోల్ చేయాల‌నుకున్నారు నిర్మాత‌లు. అందుకు మ‌న బ‌డా హీరోల రెమ్యున‌రేష‌న్‌ను త‌గ్గించాల‌ని అనుకున్నారు. మ‌రి ఆ విష‌యంపై వారితో చ‌ర్చ‌లు జ‌రిపారా! నిజంగానే ఆ విష‌యంలో ప్రొడ్యూస‌ర్స్ ముంద‌డుగు వేశారా! అంటే లేద‌నే చెప్పాలి. ఎందుకంటే ఒక‌వేళ చ‌ర్చ‌లు జ‌రిగి, అవి స‌క్సెస్ అయ్యుంటే ఫిల్మ్ ఛాంబ‌ర్ నుంచి లేదా ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ నుంచి అయినా అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చి ఉండేది. కానీ అలా ఏం జ‌ర‌గ‌లేదు. అంటే బ‌డా హీరోల‌ను అడిగే సాహసం నిర్మాత‌లు చేయ‌లేద‌నే అనుకోవాలి. పెరిగిపోత‌న్న సినిమా బ‌డ్జెట్‌ను కంట్రోల్ చేయ‌టానికి హీరోల రెమ్యున‌రేష‌న్ విష‌యంపై డిసిష‌న్ తీసుకోకుండా రోజు కూలీ చేసుకునే సినీ కార్మికుల‌ను జీత భ‌త్యాల‌ను త‌గ్గించాల‌ని నిర్మాత‌లు నిర్ణ‌యం తీసుకున్నారు. ప‌రిస్థితి చూస్తుంటే పెద్దోడిని ఏమీ అన‌లేని మ‌న ప్రొడ్యూస‌ర్స్ పేద‌వాడి పొట్ట‌గొట్టాల‌ని చూస్తున్నారంటున్నారు. అయితే సినీ కార్మికుల స‌మాఖ్య ఈ విష‌యంపై సంతృప్తిక‌రంగా లేదు. అందుక‌నే వారు స‌మ్మె వైపు అడుగులేస్తున్నార‌ని సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం. మ‌రి ఈ విష‌యం ఎంత దూరం వెళుతుందో.