Tollywood Coronavirusగత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా మళ్లీ పెరుగుదల మొదలయ్యింది. నిన్నటి రోజున దేశంలో 18 వేల పైచిలుకు కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర వంటి రాష్ట్రం లాక్ డౌన్ అంచున ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. రెండు తెలుగు రాష్ట్రాల లో కూడా కేసులు పెరుగుతునట్టు అనధికార వార్తలు వస్తున్నాయి.

ప్రభుత్వాలు అధికారికంగా తమ బులెటిన్లలలో ఆమేరకు పెరుగుదల చూపించకపోయినా కేసులు పెరుగుతున్నాయి. ఈ వార్త అటు ప్రజలను ఇటు తెలుగు సినిమా పెద్దలను కలవరపెడుతుంది. 10 నెలల పాటు పరిశ్రమ కరోనా పేరిట నరకం చూసింది. సంక్రాంతి నుండి కొద్దికొద్దిగా కోలుకోవడం మొదలు పెట్టింది. దేవుడి దయ అనుకోవాలో ఇంకోటి అనుకోవాలో సినిమాలు వరుసగా హిట్లు అవుతున్నాయి. రానున్న 6-7 నెలల వరకు వరుసగా సినిమాలు ఉన్నాయి.

ఏప్రిల్ లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో పెద్ద సినిమాలు వరుసగా రాబోతున్నాయి. వాటితో పరిశ్రమ పచ్చగా ఉంటుంది. ఈ తరుణంలో కేసులు పెరిగి మళ్ళీ లాక్ డౌన్ పెట్టాల్సిన పరిస్థితి లేదా థియేటర్లు మూయాల్సిన పరిస్థితి వస్తే కోలుకోవడం చాలా కష్టం. దానితో పరిశ్రమ అంతా దిగాలు గా ఉంది. మునుముందు ఏం జరగబోతుందో అనే ఆందోళన అందరిలోనూ కనిపిస్తుంది. ఈ గండం ఎలాగైనా గట్టెక్కలని అంతా దేవుడిని కోరుకుంటున్నారు.

అయితే ఈ పరిస్థితి కి ప్రజలు కూడా కారణమే. కరోనా కేసులు కొంచెం తగ్గగానే పూర్తిగా కాడే వదిలేశారు. మస్కులు పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించకపోవడం వంటి వాటితో మళ్లీ సెకండ్ వేవ్ తెచ్చుకునే పరిస్థితి తెచ్చి పెట్టుకున్నారు. ఒకసారి కరోనా ఉధృతి పెరగడం అంటూ జరిగితే ఇక ఏదీ మన చేతిలో ఉండదు. ఇక ఏం జరగబోతుంది అనేది చూడాలి. పరిశ్రమ మీద ఆధారపడ్డ వేలాది మంది కోసమైనా ఈ సారి లాక్ డౌన్ తప్పాలి.