Theatres Cinemas Re-Openingతెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రంలో అన్ని లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేసి నెలకు పైగా అవుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఆంక్షలు పూర్తిగా తొలగిపోలేదు. ఈ నెలాఖరు నాటికి పరిస్థితులు చక్కబడి థియేటర్లు ఓపెన్ అవుతాయి అనే అనుకుంటున్నారు.

అయితే థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉండటంతో ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. దానితో ఎవరికి వారు తమ విడుదల ప్లాన్స్ పై నోరువిప్పకుండా మిన్నకుండిపోతున్నారు. మరోవైపు కొందరు ఇండస్ట్రీ పెద్దలు ట్రేడ్ నమ్మకాన్ని దెబ్బ తీసేలా తమ స్వార్ధం తాము చూసుకుంటున్నారు.

ఈ ఆపత్కాలంలో ఇండస్ట్రీ లో నమ్మకాన్ని నింపడం మానేసి తమ సినిమాలు ఓటీటీలో అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇద్దరు పెద్దలకు థియేటర్లు కూడా ఉండటంతో ‘థియేటర్లు ఉన్నా ఓటీటీ వైపు చూస్తున్నారంటే ఏదో తేడాగానే ఉంది’ అనే సంకేతాలు వెళ్లి ట్రేడ్ అయోమయంలో పడింది.

అయితే ఈ పరిస్థితి వేగంగా మారడానికి ఒకే ఒక్క స్టార్ హీరో చాలని అంటున్నారు విశ్లేషకులు. ఎవరైనా ఒక్క స్టార్ హీరో ధైర్యం చేసి తన సినిమా డేట్ ప్రకటిస్తే మిగతా వారు కూడా లైన్ కడతారు. ఫస్ట్ వేవ్ తరువాత కూడా అదే జరిగింది ఒక్క ప్రకటన రాగానే ఏడాది చివరి వరకు లైన్ అప్ ప్రకటించేశారు.

మహా అయితే ఏమవుతుంది డేట్ ఇచ్చాక మళ్ళీ వాయిదా పడొచ్చు… తప్పేమీ కాదు కదా!వర్తమానం ఎంత దారుణంగా ఉన్న భవిష్యత్తు బావుంటుంది అనే ధీమా ట్రేడ్ కి కలిగించిన వారు అవుతారు. ఇండస్ట్రీ పెద్ద దిక్కు… మా అధ్యక్ష పదవి కావాలి అంటూ ఆరాటపడే ఇందులో కూడా చూపిస్తే పరిశ్రమ రుణపడి ఉంటుంది.