Tollywood Cinema Revivalతెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మంచి ఊపు మీద ఉంది. ప్రపంచంలో ఏ సినిమా ఇండస్ట్రీ లో లేని సందడి ఇక్కడ కనిపిస్తుంది. సంక్రాంతి సినిమాలకు ఆదరణ అదిరిపోగా… ఫిబ్రవరి లో చిన్న సినిమాల హవా ఉండనుంది. మార్చి నుండి మొదలుకొని అనేక పెద్ద సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు, చెప్పుకోదగ్గ చిన్న సినిమాలు వస్తూనే ఉంటాయి.

మార్చి మొదలుకొని వచ్చే సంక్రాంతి వరకు సినిమాలు ప్రకటించుకుంటూ పోతున్నారు. దీని కారణంగా ప్రతీ రెండు వారాలకు వేసవి వరకు ఏదో ఒక చెప్పుకోదగ్గ సినిమా విడుదల అవుతూనే ఉంటాయి. అయితే పరిశ్రమకి ఇదే మంచిదే అయినా చిన్న సినిమాలకు మాత్రం ఏమంత మంచి కబురు కాదనే చెప్పుకోవాలి అంటున్నారు విశ్లేషకులు.

“ఇన్ని సినిమాల మధ్య ప్రేక్షకులు చిన్న సినిమాలు చూడటానికి థియేటర్లకు వచ్చే అవకాశం చాలా తక్కువ. గత ఏడాది బ్యాక్ లాగ్ల కారణంగా సినిమాలు వస్తూనే ఉంటాయి ఈ ఏడాది. మంచి మ్యూజిక్ లేదా ట్రైలర్ ద్వారా చిన్న సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటే తప్ప కష్టం. చిన్న సినిమాలు ఓటీటీల వైపు మొగ్గే అవకాశం కూడా ఉంటుంది,” అని వారు అంటున్నారు.

కరోనా కారణంగా చాలా కాలం షూటింగ్లు నిలిచిపోయి చిన్న సినిమాలు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాయి. వడ్డీలు కట్టలేక నిర్మాతలు సతమతం అవుతున్నారు. ఈ తరుణంలో పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ మీద దాడి చెయ్యడం వాటికి ఇబ్బందే. చూడాలి ఈ క్రైసిస్ నుండి చిన్న సినిమాలు ఎలా తప్పించుకుంటాయో!