Mahesh - Babu - Jr NTR- ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఏ స్థాయిలో ప్రభావితం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా ప్రభావంతో సెలబ్రిటీలు సైతం ఒక్కోసారి తమ ఎకౌంటులను డీ యాక్టివేట్ చేసుకుంటున్నారంటే… వాటి యొక్క ప్రాముఖ్యత అర్ధమవుతుంది. మరి సోషల్ మీడియాలో సెలబ్రిటీలను అనుసరించే వారంతా నిజమైన అభిమానులేనా? అంటే మిగిలిన సోషల్ మీడియా విభాగాలు సంగతి ఏమో గానీ, ట్విట్టర్ మాత్రం సెలబ్రిటీలను ఫాలో అయ్యే వారిలో రియల్ గా ఎంతమంది ఉన్నారో, ఫేక్ అకౌంట్ లతో ఎంత శాతం మంది ఉన్నారో తెలియజేసింది. ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది.

టాలీవుడ్ కు వచ్చేసరికి… హీరోలలో ఎక్కువ శాతం మంది ఫాలోయర్స్ ను సొంతం చేసుకున్న మహేష్ బాబు (6.47 మిలియన్స్) ఖాతాలో కేవలం 51 శాతం మంది మాత్రమే రియల్ ఫాలోయర్స్ ఉన్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో 65%, నాగార్జున ఖాతాలో 54%, రానా ఖాతాలో 53%, అల్లు అర్జున్ ఖాతాలో 49%, పవన్ కళ్యాణ్ ఖాతాలో 46% మంది మాత్రమే రియల్ ఫాలోయర్స్ ఉన్నారు. ఈ విభాగంలో ఎస్.ఎస్.రాజమౌళి 72 శాతం మంది రియల్ ఫాలోయర్స్ తో అగ్ర స్థానంలో ఉండగా, సమంత 68 శాతంతో రెండవ స్థానంలో నిలిచింది. ఈ గణాంకాలతో నెటిజన్లలో ఉన్న “నీతి” శాతం ఎంతో బయటపడినట్లయ్యింది.

ఇక బాలీవుడ్ కు వచ్చేసరికి ప్రియాంకా చోప్రా 71%తో అత్యధిక రియల్ ఫాలోయర్స్ ను సొంతం చేసుకోగా, షారుక్ ఖాన్ 48% మంది రియల్ ఫాలోయర్స్ లో లీస్ట్ గా ఉన్నారు. హీరోలలో అమీర్ ఖాన్ ఖాతాలో అత్యధికంగా 68% మంది రియల్ ఫాలోయర్స్ ఉన్నారు. అమితాబ్ 62%, హృతిక్ రోషన్ 56%, సల్మాన్ 50%, అక్షయ్ కుమార్ 50%, దీపికా పదుకునే 67%, అలియా భట్ 61 శాతం మంది రియల్ ఫాలోయర్స్ ను సొంతం చేసుకుని ఉన్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ ఖాతాలో 53% శాతం మంది మాత్రమే రియల్ ఫాలోయర్స్ ఉన్నారు.