Tollywood Beauty Srileelaసిల్వర్ స్క్రీన్ పైన కనిపించింది ఒకే ఒక్క సినిమా అయినా, హీరోయిన్ శ్రీలీల టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారిపోయింది. రాఘవేంద్రరావు “పెళ్లి సందడి” సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టెక్కడానికి ప్రధాన కారణం అయిన శ్రీలీల వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లను సొంతం చేసుకుంటుందనే నానుడి ఊపందుకుంది.

ఇప్పటికే రవితేజ ‘”ధమాకా” నుండి శ్రీలీల ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా, యువహీరోలు నవీన్ పోలిశెట్టి, వైష్ణవ తేజ్ ల సినిమాలను కూడా ఈ హాట్ బ్యూటీ లైన్ లో ఉన్నాయి. అయితే టాలీవుడ్ షేక్ అయిపోయే వార్తలు మాత్రం లేటెస్ట్ గా వెలువడుతున్నాయి.

త్వరలో “రాధే శ్యామ్” ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు జతగా ఓ మూవీలో శ్రీలీల నటించబోతుందనే ఊహాగానాలు >ఊపందుకున్నాయి. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మారుతీ “రాజా డీలక్స్” అనే సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటించనుందని టాక్ ఇటీవల టాలీవుడ్ లో బలంగా ప్రచారం జరిగింది. అయితే ఇంకా దీనిపై స్పష్టత లేకుండానే తాజాగా మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో రూయిపుదిద్దుకుంటున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ కు అవకాశం ఉండగా, అది శ్రీలీలను వరించింది అనేది లేటెస్ట్ న్యూస్

హీరోయిన్ కు చెల్లెలి పాత్రలో శ్రీలీల ఓకే చెప్పిందని హల్చల్ చేస్తోన్న సమాచారంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా కేవలం ఒకే ఒక్క సినిమాతో ప్రభాస్, మహేష్ ల వంటి స్టార్ హీరోల సినిమాల పరిశీలనలో ఉండడం కూడా సామాన్యమైన విషయం కాదు. దటీజ్ పవర్ ఆఫ్ రాఘవేంద్రరావు అంటున్నాయి సినీ వర్గాలు.

అందుకే ప్రతి హీరోయిన్, హీరో కూడా రాఘవేంద్రరావు చేతుల మీదుగా సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అవ్వాలని ఉవ్విల్లూరుతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ ను రూల్ చేస్తోన్న మహేష్, అల్లు అర్జున్ లను తెరపై హీరోలుగా రాఘవేంద్రరావు పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇక హీరోయిన్ల జాబితాకైతే అంతం లేదు.