TJAC Kodandaram politicat Party -తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కొత్త రాజకీయ పార్టీ పెట్టడం దాదాపుగా ఖరారు అయిపోయింది. ఫిబ్రవరి నెలలో పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయనున్నట్టు కోదండరామ్ మీడియాకు తెలిపారు. తెలంగాణ జన సమితి అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం. తెలంగాణాలో బలంగా ఉన్న కేసీఆర్ కు ఆయన పోటీగా నిలవగలరేమో చూడాలి.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విస్తృతంగా పని చేశారు అన్న పేరు ఆయనకు ఉపయోగపడనుంది. ఒకప్పుడు ఇద్దరు కలిసి పని చేసిన వారే అయినా 2014 ఎన్నికలలో కేసీఆర్ ఎంపీ సీట్ ఇవ్వజూపినా ఎందుకో ఆయన అంతగా ఇంట్రస్ట్ చూపించలేదు. తరువాతి కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చెయ్యడం మొదలుపెట్టారు.

మొదట్లో కొంత ఉపేక్షించినా తరువాతి కాలంలో తెరాస ఆయనను కూడా విమర్శించడం మొదలు పెట్టింది. ఇప్పుడు ఆయన ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో మరింత రంజుగా సాగనుంది తెలంగాణ రాజకీయం. ఈ పార్టీ తెర మీదకు రావడంతో పొత్తుల పై కూడా ఊహాగానాలు మొదలవ్వబోతున్నాయి.