tirumala tirupati devasthanam opens for devoteesకరోనా కారణంగా మర్చి నెలాఖరున మూతపడిన కలియుగ వైకుంఠం… తిరుమల ఈ నెల 8 నుండి తేర్చుకోనుంది. స్వామి వారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనాలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ తరుణంలో 8 వ తారీఖు నుండి టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ప్రయోగాత్మక దర్శనాలకు టీటీడీ సిద్ధం అవుతుంది. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం తితిదేకు సూచించిన నేపథ్యంలో గంటకు 300 మందికి మాత్రమే దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

రోజుకు 15 గంటలపాటు శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించింది. దాని తరువాత సాధారణ భక్తులను కూడా అనుమతిస్తారు. అయితే అది ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయం కాలేదు. తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. నిత్యం దేవాలయం కిక్కిరిసి పోయి ఉంటుంది.

ఈ తరుణంలో ఎంతమేరకు ఈ నియమాలు పాటించగలరు అనేది చూడాలి. మరో వైపు… కరోనా ప్రభావం కనీసం దసరా వరకూ ఉంటుందని కొందరి అంచనా. దీనితో ప్రతి ఏటా దసరాకు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలకు ఎక్కువ సంఖ్యలో భక్తులకు అనుతించే అవకాశం లేదని అంటున్నారు.