tirumala tirupati devasthanam assets for saleచంద్రబాబు నాయుడు హయాంలో సదావర్తి భూములపై వైఎస్సార్ కాంగ్రెస్ చేసిన రగడ అంతా ఇంతా కాదు. చెన్నైలో ఉన్న ఆ సత్రం భూములు అన్యాక్రాంతం అవుతుండడంతో వేలం వేసింది అప్పటి ప్రభుత్వం. దానిపై అవినీతి అంటూ చాలా హంగామా చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తాజాగా ఆ పార్టీ ప్రభుత్వం అదే తప్పు చేస్తుంది

ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన తమిళనాడులో ఇరవై ఐదు ప్రాంతాలలో ఉన్న టీటీడీ ఆస్తులు అమ్మెయ్యాలని బోర్డు నిర్ణయించింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం ఈ ఆస్తుల నిర్వహణ భారంగా మారింది అనే పేరుతో ఆస్తులు అమ్మకానికి పెట్టడం గమనార్హం.

ఇవన్నీ వివిధ సందర్భాలలో స్వామి వారి భక్తులు విరాళంగా ఇచ్చింది. ఇందులో వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు, భూములు ఉన్నాయి. ఈ అమ్మకాలకు సంబంధించిన తతంగమంతా టీటీడీ లాక్ డౌన్ సమయంలోనే పూర్తి చేసింది. ఇప్పుడు అధికారికంగా ఉత్తరువులు కూడా ఇచ్చారు.

ప్రభుత్వ భూముల అమ్మకాలే వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో శ్రీవారి ఆస్తులు అమ్మకానికి పెట్టడం మరింత చర్చనీయాశం అయ్యింది. జగన్ పార్టీ శ్రీవారి ఆస్తుల దోపిడీకి పాల్పడుతుందని ప్రతిపక్షపార్టీలు ఆరోపిస్తున్నాయి. అప్పుడు మీరు చేసిన ఆరోపణలు ఏంటి ఇప్పుడు చేస్తున్నది ఏంటి అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు.