tirumala-tirupati-brahmotsavam-2020దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుండడంతో తిరుమల స్వామివారి దర్శన భాగ్యం భక్తులకు దొరకడం లేదు. కరోనా నివారణా చర్యలలో భాగంగా దాదాపు 45 రోజులుగా శ్రీవారి దర్శనాలు నిలిపివేశారు. గడిచిన వందేళ్లలో ఎప్పుడూ శ్రీవారి ఆలయం ఇన్ని రోజులు మూయలేదని పండితులు అంటున్నారు.

భూమిపై వైకుంఠంగా చెప్పబడే తిరుమలలో వేంకటేశ్వరస్వామి రోజూ తన పవళింపు సమయం కూడా రెండు మూడు గంటలకు మించకుండా చూసుకుని భక్తులకు దర్శనం ఇస్తుంటారు. అటువంటి స్వామి భక్తులకు దర్శనం ఇవ్వకుండా ఉండటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ సమస్య ఎప్పటికి తీరుతుందో.

దేవాలయాల్లో కైంకర్యాలు అన్నీ అర్చకులు యథాతథంగా జరుపుతున్నారు. మే 3 తరువాత లాక్ డౌన్ ని దశల వారీగా తొలగించినా ఎక్కువగా ప్రజలు ఉండే గుడులకు ఇప్పట్లో వెళ్ళనిచ్చే అవకాశం లేదని అంటున్నారు. అలాగే బస్సులు, ట్రైన్లు కూడా ఇప్పట్లో తిరగకపోవడంతో భక్తులు వెళ్లే అవకాశం కూడా ఉండదు.

ఈ ప్రభావం కనీసం దసరా వరకూ ఉంటుందని కొందరి అంచనా. దీనితో ప్రతి ఏటా దసరాకు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలకు ఎక్కువ సంఖ్యలో భక్తులకు అనుతించే అవకాశం లేదని అంటున్నారు. భక్తులు రాకపోయినా అన్నప్రసాద వితరణ ఆపలేదు. స్వామి వారి అన్నప్రసాదం ద్వారా రోజుకు దాదాపు లక్షా 20 వేల మందికి భోజనం అందిస్తున్నారు.