Thugs-Of-HindostanTelugul-Trailerధియేటిరికల్ ట్రైలర్ నిడివి అంటే… దాదాపుగా రెండు నిముషాలకు కాస్త అటు ఇటుగా ఉంటాయి. కట్ చేసిన ఆ రెండు నిముషాలైనా ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయా? అంటే అది ప్రశ్నార్ధకమే. కానీ ఓ సినిమా ఏకంగా మూడున్నర్ర నిముషాల నిడివి గల ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, అంతేకాదు ఆద్యంతం అలరించే విధంగా ఉంది.

అమితాబ్, అమీర్, కత్రీనా కైఫ్, ఫాతిమాలు ప్రధాన పాత్రలతో తెరకెక్కిన “థగ్స్ ఆఫ్ హిందుస్తాన్” బాలీవుడ్ మూవీని తెలుగులోకి అనువదిస్తూ విడుదల చేసిన ట్రైలర్ వీక్షకులను అలరిస్తోంది. బ్రిటిష్ కాలం నాటి కధతో రూపుదిద్దుకున్న ఈ ట్రైలర్ లోని ప్రతి షాట్ ను ఆసక్తికరంగా కట్ చేసారు. స్టార్స్ అంతా ఎవరికీ వారే ఆయా పాత్రలకు జీవం పోసారు.

ముఖ్యంగా ఈ వయసులో బిగ్ బీని ఈ రేంజ్ పవర్ ఫుల్ పాత్రలో చూడడం అభిమానులకు పండగ అని చెప్పొచ్చు. అలాగే పాత్రలకు ప్రాణం పోసే అమీర్ ఖాన్, ఫిరంగి పాత్రలో మరోసారి జీవించేసాడు. చూడబోతుంటే… ‘బాహుబలి’ సినిమా కలెక్షన్స్ టార్గెట్ గా పెట్టుకుని ఈ సినిమా ప్రమోషన్స్ సాగుతున్నట్లున్నాయి. ట్రైలర్ కూడా అందుకు తగ్గట్లే కన్నులవిందుగా ఉంది.