Thugs Of Hindostan Movie in Telugu“థగ్స్ ఆఫ్ హిందుస్తాన్” పేరుతో అమితాబ్ – అమీర్ – కత్రీనా వంటి భారీ తారాగణంతో తెరకెక్కించిన సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాగా, ఆ సినిమాకు దారుణమైన రేటింగ్స్ తో విమర్శకులు స్వాగతం పలికారు. గడిచిన కొన్ని సంవత్సరాలలో అమీర్ ఖాన్ నటించిన అత్యంత సాధారణమైన సినిమాగా దీనిని తేల్చేసారు.

విడుదలకు ముందు ఇచ్చిన హైప్ కు, సినిమాకు అస్సలు సంబంధం లేకపోవడం, పేలవమైన కధనం… ఓ సామెతలో చెప్పాలంటే, “మెరిసేవన్నీ బంగారం కాదు” అన్న రీతిలో ఈ సినిమాకు విశ్లేషకులు రివ్యూలు ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే రవిబాబు “అదుగో” సినిమా ఈ భారీ సినిమా కంటే ఉత్తమం అన్న టాక్ కూడా ట్విట్టర్ లో నడుస్తోంది.